1957 లో విడుదలైన స్వీడిష్ డ్రామా సినిమా, దర్శకత్వం వహించింది Ingmar Bergman.కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా ,మల్లీ కొత్తగా చూసిన అనుభూతికి లోనవుతాం.ఎందుకంటే? అవి మనస్సు లేయర్స్ ని విప్పి ,మన హృదయానికి హత్తుకొని మనను ఆలోచింపచేస్తాయి.ఈ సినిమా స్క్రీన్ప్లే ప్రపంచ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పాలి.ఒక వ్యక్తి గతాన్ని సునిశితంగా ఆవిష్కరించడం,ఆ కథలోని క్రైసిస్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం అంత సులువైన వ్యవహారం కాదు.ఈ సినిమా కథా,కథనాలను ఇప్పటికి క్రిటిక్స్ రీసెర్చ్ చేస్తున్నారంటే అంటే అది ఎంత పగడ్బంది స్క్రీన్ప్లే నో మీరే అర్థం చేసుకోవాలి.వాస్తవికతను,స్వప్నాన్ని విడమరుస్తూ protagonist జీవితాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేట్టు సన్నివేశాల పరంగా , సంభాషణల పరంగా చెప్పడం అసమానం.ఒక వ్యక్తి తెరపై గతంలోంచి, వర్తమానంలోకి రావడం, వర్తమానంలోంచి గతంలోకి వెళ్లడం అన్న transformation బహుఅరుదుగా జరిగిందని చెప్పొచ్ఛు.బెర్గ్ మెన్ సినిమాలు నేనెందుకు ఇష్టపడుతానంటే? రొటీన్ కి భిన్నంగా ఓ ఫిలసాఫికల్ మార్గంలో ఆలోచిస్తూ,మనిషి జీవితాన్ని ,సృష్టిలో లేని సమాధానాలను టచ్ చేస్తాడు కాబట్టి.ఆయన సినిమాలన్నీ ఆయన జీవితంలోంచి వచ్చాయి, ఆ సంఘటనల వెనుక నిజమైన సంఘర్షణ ఉంది.ఆయన ఒక భావకుడు,ఆయనొక మిథ్యావాది ,ఆయనొక స్వాపిణీకుడు. ఒక లైన్ లో ఈ కథను చెప్పాలంటే ఇది ఓ professor జీవితపు చివరిదశ కథ.ఈ కథ ముఖ్య ఉద్దేశం మనిషి జీవితంలో భూత,వర్థమానాలకు ,డ్రీమ్, రియాలిటీ లను కలగలిపి వాడి జీవితాన్ని చివరి దశలో సమూలంగా చర్చించడమే.ఒక వ్యక్తి తన గతాన్ని గుర్తుచేసుకొని, వాటి తాలూకు తన చర్యలకు పశ్యాతాపపడి తను గురుంచి తను తెలుసుకోవడమన్న అన్న మానసిక పరిపక్వతను సినిమా మాధ్యమము ద్వారా ఉద్బోధించడం ఈ సినిమాలో చెప్పినట్టుగా మరో సినిమాలో లేదనిపిస్తుంది.చివరిగా Ingmar Bergman మాటల్లో..” Film as dream, film as music. No art passes our conscience in the way film does, and goes directly to our feelings, deep down into the dark rooms of our souls”. By.Prakash Surya
‘Wild Strawberries ‘ By.Prakash Surya
28
previous post