రదనీటితో వాహనదారులకు తప్పని తిప్పలు
ప్రధాన రహదారులపై నిలిచిన వాహనాలు..అంతట ట్రాఫిక్‌జాంలు..
హైదరాబాద్ :
ఉరుములు, మెరుపుతో ఒక్కసారిగా భారీగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు మొత్తం వరదనీటితో నిండిపోయింది. దీంతో వాహనదారులు ఆందోళన చెందారు. శనివారం నాడు భారీగా కురిసిన ∙వర్షానికి మలక్‌పేట్‌జోన్∙పరిధిలోని ప్రాంతాలు కాలనీలు జలమయంగా మారాయి. అంతట వర్షానికి కాలనీలోని డ్రై నేజీలు రహదారులపై ప్రవహించాయి. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, అల్కాపురి చౌరస్తా, మూసారంబాగ్ చౌరస్తా,నల్గొండ క్రాస్‌రోడ్డు, చాదర్‌ఘాట్‌లలో ట్రాఫిక్ స్థంబించింది.కొద్దిసేపు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. అంతట ప్రధాన రహదారులు జలమయంగా మారాయి.
వర్షానికి జోన్‌పరిధిలోని అల్కాపురి, మార్గదర్శికాలనీ, టెలిఫోన్‌కాలనీ, దిల్‌సుఖ్‌నగర్,శంకేశ్వరబజార్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట్, అజంపుర, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్‌కేపురం, ఐఎస్‌సదన్, కొత్తపేట్, తదితర ప్రాంతాలు జలమయంగా మారాయి. ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో ఆర్‌కేపురం, సరూర్‌నగర్, మలక్‌పేట్‌లోని పలు కాలనీలలో విద్యుత్ నిలిచిపోయింది. చెట్లు విరిగి పడ్డాయి. కురుస్తున్న ∙వర్షానికి ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కాలనీలలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కాలనీలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే కాలనీవాసులు జిహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్ చేయాలని అందరు అప్రమత్తగా ఉండాలని అధికారులు విజ్ఙప్తి చేశారు.