Home సినిమా రివ్యూస్ ‘The Shawshank Redemption’ By.Prakash Surya

‘The Shawshank Redemption’ By.Prakash Surya

by live
0 comment

చరిత్రలో Oscar Awards Committee కొన్ని మంచి సినిమాలకు అవార్డ్స్ఇవ్వలేకపోయింది, అలాంటి సినిమాలలో ఇదొకటి.ప్రపంచ సినిమా చరిత్రలో ఓ అద్భుతం జరిగింది, అది ఏంటంటే? 1994 సంవత్సరం లో “The Shawshank Redemption” విడుదలై ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోవడం.ప్రఖ్యాత రచయిత Stephen King నవల “Rita Hayworth and Shawshank Redemtion” ఆధారంగా తీసిన సినిమా ఇది.Frank Derabont మొదట హారర్ సినిమాలు తీసినా,తరువాత నాకే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది సినీ అభిమానులకు ఇష్టమైన దర్శకుడు అయ్యాడు.ఆయనకు సినిమా ఓ ఇన్స్ట్రుమెంట్, సమాజంలో జరిగే అనేక సంఘటనలకు భీతులకు పరిష్కారాన్ని ఇచ్ఛే సాధనం.”జైలులో గడిపిన ఇద్దరు వ్యక్తుల భాదామయ జీవితంలోంచి,జైలుకు తరుచుగా వచ్ఛే అమాయకుల బ్రతుకు పోరాటం లోంచి, ఆయా వ్యక్తుల ఆవేశాల్లోంచి ఉద్భవించిన సినిమా, కథ తనకు తానుగా కథానికై ఆయా పాత్రలకు ఏవిదంగా పరిష్కారం చూయించిందన్నదే స్టోరీ లైన్.ఆ ఐడియా ను వెండి తెరపై ఆవిష్కరించి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన దర్శక దార్శనికుడు “Frank Derabont”.ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే పాత్రలను నాటకీయత ఎక్కడా లేకుండా పాత్రోచితంగా తీర్చిదిద్దడం, జైలులో గడిపే వ్యక్తుల అంతర్మధనాన్ని ,బాధని ప్రేక్షకుడికి కనెక్ట్ చేసి, ఆయా పాత్రలతో వారు ప్రయానిస్తున్నట్టు చేసి వారి తో మమేకం అయ్యేట్టు చేయడం.ఎండీ, రెడ్ రెండు పాత్రలు ఒకదానికొకటి పోటీపడి, 3 dimensions of character లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుడు ని మరో లోకంలో విహరింప చేయడం screenplay విశేషం.చాలా సంవత్సరాలు జైలు లో గడిపిన వారు బయట సమాజంలో ఇమడలేక, వారికి ఆత్మహత్య శరణమన్న Thought provoking point మనను ఆలోచింప చేస్తుంది.ఒక కథను, screenplay ను ప్రేక్షకుల ఆలోచన తగ్గట్టుగా ఎలా రూపొందిన్చ వచ్చొ ఈ సినిమా మనకు తెలియచేస్తుంది.Thomas Newman సంగీతం మనను సమ్మోహులను చేస్తే, Roger Dearkins సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.Tim Robbins, MorganFreeman, Bob Gayon , William Sandler, Clancy Brown, James Whitmore, ఎవరికి వారే పోటీపడి నటించిన అద్భుత చిత్రరాజమిది.                                                               By.Prakash Surya

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4