Home సినిమా రివ్యూస్ “The Curious Case Of Benjamin Button” By.Prakash Surya

“The Curious Case Of Benjamin Button” By.Prakash Surya

by live
0 comment

అచేతన యొక్క అభివ్యక్తీకరణమే కళ, ఆ కళ కి ప్రతిరూపమే ఈ సినిమా.స్క్రీన్ ప్లే రైటర్ Eric Roth ప్రపంచ సినీ చరిత్రలో సృష్టికి ప్రతి సృష్టి చేసిన సినిమా ఇది.December 25, 2008 లో American Fantacy Romantic Drama గా విడుదలై ,13 Oscar Awards కి నామినాటే అయి, 3 అవార్డ్స్ ని కైవసం చేసుకుంది.ఇక కథలోకి వస్తే” మొదటి ప్రపంచ యుద్ధంలో సైనుకుడైన కొడుకును కోల్పోయిన తండ్రి, ఓ పెద్ద క్లాక్ ని తయారు చేసే పనిలో ఉంటాడు.తన కొడుకు మళ్లీ జన్మించాలని Roosevelt సమక్షంలో క్లాక్ ని ఆవిష్కరించి, రివర్స్ గేర్ లో సెట్ చేసి, అనంత దుఃఖంతో సుదూరప్రాంతానికి నిష్క్రమిస్తాడు.ఈ కథను ఓ ఆసుపత్రిలో ఉన్న వృద్ధురాలు, తన కూతురికి చెబుతూ, బ్యాగ్ లో ఉన్న డైరీ ని ఓపెన్ చేయమని చెబుతుంది.ఆ డైరీ ఎవరిదో కాదు మన హీరో బెంజమిన్ బటన్(Brad Pitt) ది.ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.పుట్టుకతో వృద్ధుడిగా పుట్టిన ఆ పసిగుడ్డు,తల్లిని కోల్పోతాడు, తండ్రి ఓ బటన్ ఫేక్టరీ యజమాని, కొడుకు పుట్టుకను చూసి,వాడిని ఒదిలించుకోవాలని, ఓ ఇంటి మెట్లపై వదిలేసి వెళ్ళిపోతాడు, ఆ పసిగుడ్డుని Queeny అనే నల్లజాతీయురాలు చేరదీసి, అపురూపంగా పెంచుతుంది.ఆ పసిగుడ్డు వృద్ధ్యాపం లోంచి, మధ్య వయస్కుడిగా, మధ్య వయసునుంచి యువకుడిగా, యువకుడి నుంచి బాలుడిగా, బాలుడి నుంచి పసిగుడ్డుగా పరిణామం చెంది గిట్టడమే స్థూలంగా కథ.Eric Roth ఎవరో కాదు “Forest Gump”కి స్క్రీన్ప్లే అందించిన రైటర్.యూనివర్సల్ స్టూడియో నిర్మాణంలో అసలు ఈ సినిమాకి దర్శకత్వం వహించవలిసింది Steven Speilberg తను Jurassic Park, Schindlers list ప్రొడక్షన్ లతో బిజీ గా ఉండడం వల్ల దర్శకత్వం వహించే అవకాశం David Fincher కి దక్కింది. Brad Pitt, Cate Blanchet, Taraji P.Henson, Julia Ormond,Jason Fleming,Elias Koti as,Tidak Twinton లు ఎవరికి వారు సాటై, వారి, వారి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రపంచ సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు.Alexander Desplat సంగీతం మనను సమ్మోహులను చేస్తే,Claudio Miranda సినిమాటోగ్రఫీ కట్టిపారేస్తుంది.చివరిగా సినిమాలోని మాట “I hope you see things that startle you. I hope you feel things you never felt before. I hope you meet people with a different point of view. I hope you live a life you`re proud of, and if you find that you`re not, I hope you find the strength to start all over again.                                                                                                                                                                                                                                                                                                                                                                                                             By.Prakash Surya

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4