ఆ మధ్య ,ఓ ప్రఖ్యాత సినిమా నిర్మాణ సంస్థ కోసం,ఓ కథకి, Screenplay రైటర్ గా రీసెర్చ్ కోసం కొల్లేరు వెళ్లగా అక్కడ ఆకాశంలో గుంపులు, గుంపులు గా ఎగురుతున్న పక్షులు ఎదురైనప్పుడు, అవి ఎక్కడ దాడి చేస్తాయోయన్న భయం కలిగింది,బహుషా “The Birds” సినిమా నా sub- concious మైండ్ లో వేసిన బలమైన ముద్ర కావచ్చుఁనేమో!Alfred Hitchcock ఓ సస్పెన్స్ మాయా మాంత్రికుడు, వెండితెర పై సృజనాత్మకతను మాయా దర్పణంలో బంధించి, ప్రేక్షకుల అచేతనంలో ఉన్న రససిద్ధిని సృజించే దర్శక ఘనాపాటి.ఆయన సినిమాలు స్వప్నాల్లా మెదులుతూ,మన మెదళ్లపై శాశ్వత సంతకం చేసి,దాంతశక్తులను చైతన్యపరిచి,మనస్సు అంతరంగంలో ఉన్న భయాన్ని అనుభూతి ఐఖ్యతగా యధాతంగా మనస్సు పోరలను ఒక్కొక్కటిగా విప్పుతూ రసానుభూతిని కలిగిస్తాయి.ఈ కథ యదార్థ సంఘటనలోంచి ఉద్భవించింది.ఆగస్టు 18,1961 వ సంవత్సరంలో Californea లోని capitole అనే చిన్న town లో ఒకరోజు కొన్ని వందల సంఖ్యలో పక్షులు domioc acid poison వల్ల పుర వీధుల పై
నేల కొరిగాయి.మరుసటి రోజు ఆ వార్తను పత్రికల్లో, పతాక శీర్షికలో చూసిన Alfred Hitchcock తను తీయబోయే thriller సినిమాకి నేపథ్యంగా తీసుకొని ,ప్రఖ్యాత Screenplay రైటర్ Evan Hunter కి Dephandue Mauner నవల “The Birds”ని adapt చేయమని పురమాయించాడు.ఇది ఈ సినిమా వెనుకాల ఉన్న అసలు కథ.1963 లో Horror-Thriller గా విడుదలై,Hitchcock స్వయానా నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది. Animater, Ublwerks,walt Disney స్టూడియో లో అహోరాత్రులు శ్రమించి sodium vapour process(yellow screen) లో పక్షులు,మనుషుల పై దాడి చేసే స్పెషల్ ఎఫెక్ట్స్ ని రూపొందించాడు.ఇక స్థూలంగా కథ గూర్చి చెప్పాలంటే “వరసగా వందల సంఖ్యలో పక్షులు Bodega Bay అన్న గ్రామంలో మనుషులపై దాడి చేస్తుంటాయి.ఎటు చూసినా భయాందోళనలు! అసలు పక్షులు ఎందుకు దాడి చేస్తున్నాయి?ఎందుకింత పగబట్టాయి?ఎవరి దగ్గరా సమాధానం లేదు? ఇది Alfred Hitchcock సృష్టించిన అపూర్వ భయానక ఆలోచన.అంతగా గ్రాఫిక్స్ అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ఆ భయానక ఘట్టాలని ఎలా తెరకెక్కించారన్నది ప్రతి సినీ అభిమానిని ఆలోచింప చేస్తుంది.కొన్ని వందల వేల సంఖ్యలో పక్షులతో నటనను రాబట్టడం ,అందుకు అనుగుణంగా నటీ,నటుల హావభావాలను చిత్రీకరించడం బహుశా Alfred hitch cock కే సాధ్యమేమో! Alfred Hitchcock సినిమాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో అనచబడిన ప్రేరణలు,స్మృతులు,అనభవాలు,అనుభూతులు,ఘర్షణలు ఒక్కొక్కటిగా మేల్కొంటాయి.ఆయన సినిమాలు చూస్తున్న ప్రతిసారి ఓ సౌందర్య అనుభూతిని పొందుతూ తడిసి ముద్దై,ఉద్దీపన కలుగుతుంది.సృష్టి, సహృదయుడు అనే పదాలు రసతత్వానికి ప్రధాన భూమికలు.కావ్యాన్ని సృష్టించినా, సినిమాలను తెరకెక్కించినా, దేన్ని సృష్టించిన వ్యక్తయినా స్రష్ట అవుతాడు.ఆ సృష్టించిన వాటిని రసాస్వాధన చేసే వ్యక్తి సహృదయుడు అవుతాడు.Alfred Hitchcock ఓ స్రష్ట,సహృదయుడు కూడా. By.Prakash Surya
“The Birds” By.Prakash Surya
41
previous post