ఈ సినిమా చూస్తుంన్నంతసేపు మీరు Confuse అయ్యారంటే? మీరు నోలన్ ట్రాప్లో పడిపోయినట్టే.ప్రేక్షకులను సమాధాన పరచడం కాదు, వారిని అసాంతం confusion కి గురిచేయడం ఈ సినిమా లక్ష్యం.Super Star Director Christopher Nolan తన సహజసిద్ధమైన టైం ట్రావెల్ ట్రేడ్ మార్క్ తో “The Dark Night,Memento, Inception, Interstellar లాంటి సినిమాలతో ప్రపంచ సినీప్రేక్షకులను సమ్మోహన నిద్రకు ఉపక్రమింపచేశారు.ఎందుకో ఆ అనుభూతిని నేను ఈ సినిమాలో పొందలేక పోయాను అని అనిపించింది. ఆయన ప్రతిపాదించిన అచేతన,మనస్సు యొక్క అభివ్యక్తీకరణ సినిమా అన్న సిద్ధాంతాన్ని నేను విశ్వసిస్తాను.”ఓ CIA ఏజెంట్, అతని సహచరుడు, కోల్డ్ వార్ నేపథ్యంలో “Reversing the flow of Time” అనే టెక్నాలజీని ఉపయోగించి,”Tenet” అనే సీక్రెట్ సంస్థతో వారు జతకలిసి మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఏవిధంగా అపారన్నది సెంట్రల్ ఐడియా.” ఫక్తు జేమ్స్ బాండ్ మసాలా సినిమాకి Time Inversion,Molecular Entropy,Grand Father Paradox, Plutonium 241,Linear Time Travel,Turnstyle అనే Hypothetical Theories ని కలగలిపి Don’t Try To Understand, Just Feel it అన్న డైలాగ్ ని convienient writing తో subtext లో చెప్పడం ద్వారా కథా,కథనాలకు లక్ష్యం లేకుండా పోయిందనే చెప్పవచ్చుఁ.Dont convince the audience, only confuse the audience అన్న ఏకైక లక్ష్యంగా Screenplay చివరివరకు కొనసాగడంతో “Mood Of The Auditorium” డిస్టర్బ్ అయి ఎమోషనల్ గ్రాఫ్ పడిపోయింది.కథలో zero% రియాలిటీ 100% ఫిక్షనల్ కన్ఫ్యూషన్ కొంత గందరగోళానికి గురిచేసింది.ఉదాహరణకు Grandfather Paradox ని తీసుకుంటే ఒకడు, వాడి Grandfather టైం లోకి ట్రావెల్ చేసి, అతన్ని హత్య చేసి వాడి ఉనికిని వాడే ప్రశ్నిచుకుంటే అదీ సంభవమే? అన్న ప్రశ్నకు సమాధానం ఎక్కడా దొరకదు.సినిమాకి ఆయువుపట్టైన టెక్నాలజీ ని సగటు ప్రేక్షకుడికి విసువల్ గా అనువయించకుండా, డైలాగ్ ల ద్వారా సరిపెట్టడం మరో ప్రధాన లోపంగా తోస్తుంది.Protagonist (Jhon David Washington) మూడవ ప్రపంచ యుద్ధంతో మానవాళికి సంభవించే వినాశనాన్ని పక్కనపెట్టి, ఓ అపరిచితురాలు kat (Elizabeth Debicki)కోసం తన లక్ష్యాన్ని ఫణంగా పెట్టడం కథనం యొక్క అపరికత్వాన్ని సూచిస్తుంది.Screenplay అంటే సృక్ట్రల్ ఎమోషన్, ఆ ఎమోషన్ చాలావరకు లోపించిందనే చెప్పవచ్చుఁ…చివరిగా.. సహజపరమైన సృజనాత్మక శక్తి లేదా కళాశక్తి ఒక దర్శకుడి ఎలా అబ్బుతుందో ఏ శాస్త్రం ఇతిమిత్తంగా చెప్పలేదు.ఆ శాస్త్రాన్ని తన అంతర్గత తృష్ణతో తన మనో వైజ్ఞానిక నేత్రంతో ప్రశ్నించినవాడు క్రిస్టోఫర్ నోలన్ అందులో ఎలాంటి సందేహం లేదు.ఆయన స్థితిని ఆత్మికానుభవంగా చెప్పాలంటే ఉరుకులు,పరుగులు తీసే ఆలోచనల, ప్రతిమల కళాసృష్టి ప్రవాహం.
“Tenet”Story, Screenplay A Case Study” By Prakash Surya
22