32
తెలంగాణ కేబినెట్ సమావేశం లేనట్టే.
హైదరాబాద్ :
తెలంగాణ కేబినెట్ సమావేశం లేనట్టే. ఎన్నికల కమీషన్ (ఈసీ) అనుమతి ఇవ్వకపోవడంతో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలకు సంధించిన పోలింగ్ ముగిసినా అమల్లో ఉన్న కోడ్ ఉంది. కాగా ఈ నెల 27న ఉమ్మడి ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపధ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సెక్రటేరియట్లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు.