దర్శకుడు తన ఆలోచనకి ఓ యూనివర్సల్ సమస్యను జతచేసి, సబ్ ట్రాక్ గా భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులని ఎన్నుకొని, వారికి సపోర్టింగ్ గా ఓ musical బ్యాండ్ ని తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ప్రజలందరి ఎమోషన్స్ ఒకటే అని, భాష రాని వారికి కూడా అర్ధమయ్యే రీతిలో స్క్రీన్ప్లే ని తీర్చిదిద్దడం విశేషం.ఇక కథలోకి వస్తే నార్త్ ఆఫ్రికా నుంచి tareq, amira లు ఇల్లీగల్ గా ఇటలీ లో ల్యాండ్ అవుతారు,వారివి భిన్నమైన మనస్తత్వాలు, ఇద్దరూ పారిస్ లో తమ కలలను సాకారం చేసే దిశగా పయనిస్తుంటారు.ఇటలీ ప్రభుత్వం migrants పై అడుగడుగునా గస్తీ ఏర్పరిచి, దొరికితే వారిని వాళ్ల వాళ్ల దేశాలకు తిరిగి పంపించేస్తుంటుంది.evangelist అనే musical బ్యాండ్ వారిద్దరిని భార్యా, భర్తలనుకొని పొరపాటుపడి సహృదయాతో చేరదీస్తుంది.ఆ బ్యాండ్ వారిద్దరిని ఏకం చేసి, వారి కలలను సాకారం చేసుకోవడానికి ఏవిదంగా తోడ్పడ్డారన్నది స్థూలంగా కథ. ఈ సినిమాకి ముందు దర్శకుడు “Fake Honymoon” అనే ఐడియా కు కథారూపం ఇస్తుండగా 2011 లో ప్రపంచాన్ని కుదిపివేసిన ఇమ్మిగ్రెంట్స్ సమస్యను జత చేసి వారి బ్రతుకు పోరాటాన్ని ,యదార్థ సంఘటనలను రీసెర్చ్ చేసాడు.కథకి authenticity ని ఇవ్వడానికి అల్జీరియన్ రచయిత Amara Lakhouse ఇఛ్చిన inputs తో కథానికను మలిచాడు.immigrants సమస్య అనేది యూనివర్సల్ కథావస్తువు.అలాంటి సమస్యను వెండితెరపై ఆవిష్కరించి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ చేయాలంటే స్క్రీన్ప్లే లో ఆయా ఎమోషన్స్ ని బ్యాలన్స్ చేయడం ముఖ్యం. దర్శకుడు కథను డ్రైవ్ చేసిన విధానం, అమైరా, తారేఖ్, ల భావోద్వేగాలను humour ని రంగరించి తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది.ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రఖ్యాత ఇటాలియన్ దర్శకులు Fedrico Fellini మరియు Michelangelo Antonioni ల దర్శకత్వ మెలకువలు నాకు గుర్తొఛ్చాయి. By.Prakash Surya
“Taranta On The Road”By.Prakash Surya
29