35
తెలంగాణ రాష్ట్ర గీతం…!!
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక, వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జన జాతర
అను నిత్యము నా గానం… అమ్మా నీవే మా ప్రాణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
గోదావరి, కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
జయ జయహే తెలంగాణ గీతానికి ప్రభుత్వం ఆమోదం
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీ రాక.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వానం.