మీరు నిజమైన సినిమా ప్రియులైతే ఓ గొప్ప సినిమాని మీ జీవితంలో చూడాలనుకుంటే, వెంటనే “1917” సినిమాని చూడండి.చాలా రోజుల తరువాత ప్రపంచ సినీతెరపై అద్భుతానికి పర్యాయ పదాలైన Best Direction, Best Original screenplay, Best Cinematography లను నేను దర్శించాను.యుద్ద నేపథ్యం గల సినిమాల్లో నాకు ఇంతవరకు బాగా ఇష్టమైన సినిమాలు Terrace Malicks “The Thin Redline” “Saving private rayan” “Hurt Locker” “platoon”. ఈ పై సినిమాల కన్నా గొప్ప సినిమా “1917” అని ఖచ్చితంగా చెప్పగలను.ఇక స్థూలంగా ఈ సినిమా కథ చెప్పాలంటే “1917 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇద్దరు సైనికులు (ఒక సైనికుడు వీర మరణం పొందగా) మిగిలిన ఒకానొక సైనికుడు తమ 16 వందల మంది బ్రిటిష్ సైనికులతోపాటు వీరమరణం పొందిన సైనుకుని సోదరుణ్ణి, జర్మనీ సైనికుల ట్రాప్ నుంచి ఏవిధంగా కాపాడాడన్నది కథ”.Feature length single shot experience గా సినిమా చూస్తున్న ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి కలగడం ఈ స్క్రీన్ప్లే విశేషం.వాస్తవానికి ఈ కథ సామాన్యమైనది కానీ అసామాన్యమైన చిత్రానువాదం, సినిమాటోగ్రఫీ లు dominate చేసాయి.ప్రతి షాట్, ప్రతి ఎపిసోడ్ ఓ ఇంటర్వెల్ బ్యాంగ్. ఈ Screenplay (చిత్రానువాదం) లో Rhythm,Balance and Proportion తో పాటు డ్రామా, Series Of Conflicts (Both external, Internal and physical) సమపాళ్లలో ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ప్రపంచ సినీప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది.కథ వస్తుపరమైనదే, చిత్రానువాదం మాత్రం సంపూర్ణ ప్రక్రియ.కథ ఎలాగైనా ఉండవచ్చుఁ,స్క్రీన్ప్లే మాత్రం అనుక్షణం ఏమిజరుగుతుందో అన్న ఉత్సాహాన్ని రేకెత్తించేదిగా ఉండాలి.ముఖ్యన్గా క్రమబద్ధమైన నడక, ముగింపు మనను హూంట్ చేసేవిధంగా ఉంటూ, సమస్తం ఏకవిషయం ఏకమొత్తంగా సాగాలి.ప్రేక్షకుడు ఎలాంటి ఆలోచనలతో సినిమా హాల్ లో రంగప్రవేశం చేసినా వాడిని అనుక్షణం ఉత్కంఠకు గురిచేస్తు ఉండాలి.అలాంటి లక్షణాలన్నీ ఈ స్క్రీన్ప్లే సొంతం.ఈ సినిమాలో నేను దర్శించిన అంశాలు. 1)వస్తువు 2)పాత్రలు 3)వాతావరణం 4)శైలి 5)ఏకాగ్రత 6)నిర్భరత 7)స్వయం సమగ్రత 8)ప్రతివాధ్య ప్రణవత. చివరిగా ముఖ్యమైనది చిత్రానువాదం. By Prakash Surya
“Story, Screenoplay A Case-Study ‘1917 (2020)’ By Prakash Surya
23
previous post