60
త్రి శక్తి పీఠంలో శ్రీ శక్త్యా నందగిరి స్వామికి ఘన సత్కారం
హైదరాబాద్ : బాచుపల్లి కేంద్రంగా విరాజిల్లుతున్న త్రిశక్తి పీఠం అధిపతి శ్రీ శక్త్యా నందగిరి స్వామకి శనివారం ఘన సత్కారం జరిగింది. స్వామిజీ స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా కోసూరు గ్రామానికి చెందిన గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకులు చిందా వీర వెంకట నాగేశ్వరరాజు స్వామిజీని మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా స్వామి వారిని సత్కారించి ఆయన ఆశీర్వాదం అందుకున్నారు. అదే విధంగా ఆ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిసి నాయకులు మురారి శ్రీనివాసరావు, రాజుపేటకు చెందిన దళపతిరావు వెంకటేశ్వర రాజు లు స్వామిజీని సత్కరించి ఆయన ఆశీస్సులు పొందారు.