చాంద్యోగపనిషత్ లోని “సత్యకామ జబాలి”ని మాతృకగా చేసుకొని నిర్మించిన సినిమా ఇది. భారతీయ సంస్కృతిలోంచి,సనాతన ధర్మలోంచి పుట్టిన కథ.సినిమా ఓ యోగ శక్తి లాంటిది,భ్రూమధ్యలోంచి సంకల్పశక్తి వల్ల పుట్టిన నాదం.మణిపూరకం నుంచి అనాహతం వరకు వ్యాపిస్తుంది,దాన్ని పరమ శివుడు పరిపాలిస్తుంటాడు, నిరంతరంగా రససంయోజనాత్మకాన్ని దర్శించగల ప్రేక్షకులే దర్శిస్తారు.అనాహతం నుంచి విశుద్ధవరకు ఆ త్రినేతృడే నడిపిస్తాడు.హృదయంలోని భావాలను విశుద్ధపరిచి లోకానికి శుభం కలిగే మాటలను “సత్యకామ్” ద్వారా దర్శకుడు హృషీకేశ్ ముఖర్జీ చెప్పే ప్రయత్నం చేశారు.ఇక ఈ సినిమాకు, నవలకు ప్రేరణ అయిన “సత్యకామ జబాలి” కథలోకి వస్తే తన తండ్రి ఎవరో తెలియని సత్యకామ, సప్తసింధూ ప్రాంతంలోని నదీ తీరంలో తన శిష్యులకు బ్రహ్మజ్ఞాన్ని భోదిస్తున్న గౌతమ మహాముని దగ్గరకు వెళ్లి తనను శిష్యుడిగా చేర్చికోమని కోరతాడు, అందుకు గౌతమ మహాముని వేదాధ్యానం చేసేవాడు జంధ్యం ధరించి ఉండాలన్న విషయాన్ని తెలియపరుస్తూ, నీ గోత్రం, వంశం ఏదో ఇంటికి వెళ్లి తెలుసుకోరామని కోరతాడు.ఆ బాలుడు ఇంటికి వెళ్లి తన తండ్రి ఎవరని తల్లిని అడుగుతాడు.అందుకు తల్లి నేను చాలా కాలం పాటు అనేక మంది అతిథుల్ని సంతృప్తి పరుస్తూ జీవించేదానినని ఆ సమయంలో నీవు పుట్టావు,నీవు ఎవరికి పుట్టాఓ నాకు తెలియదని,నీ పేరు సత్యకామ,నా పేరు జబాలి అని గౌతమ మహామునికి చెప్పమని అంటుంది.తన తండ్రి ఎవరో తెలియకపోయిన,అసత్య మాడక అందరి ముందు చెప్పడంతో గౌతమ మహాముని,సత్యకామ, సత్యనిష్ఠకు సంతసించి శిష్యునిగా చేసుకుంటాడు.తరువాత సత్యకామ ఏ విధంగా బ్రహ్మజ్ఞాన్ని పొంది, గురువై ఏవిదంగా ధర్మప్రచారాన్ని చేసాడన్నది అసలు కథ.ఈ కథను అన్వయించి అనేక సినిమాలు రూపొందాయి, అందులోని ఒక సినిమా “సత్యకామ్”.భారతదేశానికి స్వాతంత్రం సిద్దించిన తొలి రోజుల్లోని సామాజిక పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూయించిన చిత్రం.1969 లో విడుదలైన ఈ సినిమాలో ధర్మేంద్ర,షర్మిల ఠాగూర్,సంజీవ్ కుమార్,అశోక్ కుమార్,ఎవరికి వారే పోటీపడి నటించిన సినిమా. By.Prakash Surya
“సత్యకామ్” By.Prakash Surya
30
previous post