Home సినిమా రంగామార్తాoడ:ఒక “అంతులేని కథ ఒక “సాగరసంగమం” By Prakash Surya

రంగామార్తాoడ:ఒక “అంతులేని కథ ఒక “సాగరసంగమం” By Prakash Surya

by live
0 comment

స్వీయ విధ్వంసం యొక్క పరిపూర్ణ స్మారక చిహ్నం ఈ కథలోని కథానాయకుడు.ఆయన ఒక న్యూరోటిక్ తాగుబోతు, అత్యంత తెలివైన చమత్కార మహనీయుడు.”వ్యక్తుల కంటే పాత్రలు మరింత వాస్తవంగా ఉండగలవని,కాంక్రీటు కంటే కాల్పనిక విషాదం చాలా లోతైనదని ఈ సినిమా చెప్పకనే చెబుతుంది.”ఇది సినిమా కాదు, “అమ్మా నాన్నల సజీవ బ్రతుకు పోరాట చిత్రం”.జీవితంలోని సంఘటణలను,విధిని, మార్పును,నాటకీయత యొక్క ప్రేమ ఒకరి స్వంత రహస్య ఉద్దేశాలతో ప్రశ్నిచాలని మనని ఆలోచింప చేస్తుంది.”ఈ కథ కుటుంబ నేపథ్యంలోని గంభీరమైన సంఘర్షణలని వివరిస్తూ “రంగారావు” (ప్రకాష్ రాజ్) జీవితంలోని విషాదాన్ని, అత్యంత శుద్దిచేయబడిన సంస్కరణగా ఇది ప్రతివారి జీవితంలోని తార్కికాన్ని విడమరిచి చెబుతుంది.”విషాదం నాటకీయ రూపంలో ప్రదర్శించబడే ప్రక్రియ అని ఈ కథనం చెప్పకనే చెబుతుంది.జీవితంలోని నాటకీయత విషాదం కంటే అత్యంత పొడవుగా ఉంటుంది.అది చాలా విస్తృత పరిధిలో “చక్రి” (బ్రహ్మానందం) పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను సంభ్రమశ్ఛర్యాలకు గురిచేస్తుంది.పాత్రల యొక్క నాటకీయ చర్యల ద్వారా జీవితంలోని సంఘర్షణను సేన్ద్రియంగా చెప్పడంతో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు.”మేజిక్ రీలిజం కి నూతన అర్థాన్ని విడమరిచి చూపి మూసను సమూలంగా కాలదోసిన సజీవ చిత్రమిది”. “కథనే కాదు కథనాన్ని ధార్మికంగా విశ్లేషించి వెండి తెర పై తీర్మానాలు చేయడం ద్వారా రససిద్ది కలుగుతుందని ఈ సినిమా ద్వారా దర్శకుడు నిరూపించాడు.”చిత్రనువాదంతో నాటకాన్ని సినిమా అనుకరణ ద్వారా, భాష, లయ, సామరస్యాన్ని, విడిగా లేదా కలయికగా చెప్పిన విధానం ప్రతివారిని ఆకట్టుకుంటుంది.”కాలం,మనోరంజకం, మేధోప్రయానం, సకల వెండితెర తత్వాలకు దర్శకుడే సొంతదారు…ఆయనే క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశి.By-ప్రకాష్ సూర్య

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4