Home ఇంకా పుట్టిగుడ్డే కానీ.. అందరి చూపునే తనవైపు తిప్పుకునేలా చేసింది

పుట్టిగుడ్డే కానీ.. అందరి చూపునే తనవైపు తిప్పుకునేలా చేసింది

నాడు చెత్తకుప్పలో పారేసిన పేరెంట్స్ కి అదిరిపోయే జలక్

0 comment

8మహారాష్ట్ర:

పుట‍్టుకతోనే కంటిచూపు కోల్పోయిన ఓ యువతి.. తన విధిరాతకు తల వంచలేదు. అలాగే తనకున్న లోపానికి కుంగిపోలేదు. ముఖ్యంగా.. కన్న తల్లిదండ్రులే పుట్టగానే తనని వద్దనుకుని చెత్తకుప్పలో పడేశారు. కానీ, ఇప్పుడు ఆ అమ్మాయే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ క్లియర్ చేసి ముంభై సెక్రటేరియట్‌లో క్లర్క్ కం టైపిస్ట్ జాబ్ కొట్టి అందరి దృష‍్టిని అందరి చూపునే తనవైపు తిప్పుకునేలా చేసింది. ఆమె పేరే మాలా పాపాల్కర్‌.

ఈమె పుట్టుకతోనే అంధురాలు. ఇక పుట్టగానే ఆ చిన్నారిని కన్నవారు చెత్తకుప్పలో పడేయటంతో.. తనని జల్గావ్ లోని రిమాండ్ హోమ్ కు తరలించారు. కాగా, అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న అంధుల అనాథాశ్రమంలో చేర్చారు. ఇక అక్కడే ఆ అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుంది. అంతేకాకుండా.. పద్మ శ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్(81) ఆ చిన్నారికి తన ఇంటి పేరుతో నామకరణం చేశారు. అలాగే బ్రెయిలీ లిపిలో చదువు చెప్పించాడు.

ఇక తాజాగా మే 16న విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా మంచి ర్యాంక్‌ ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే.. ముంభై సెక్రటేరియట్ లో క్లర్క్ కం టైపిస్ట్ జాబ్ ను సాధించింది. కాగా, నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికే దేవుడు ఈ అనాథాశ్రమం వాళ్లను పంపించాడని, ఇక్కడితో తాను ఆగనని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని IAS అవడమే తన లక్ష్యమని మాలా చెప్తుతోంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4