చాలా రోజుల తరువాత ఓ మంచి సినిమాని చూసిన అనుభూతి కలిగింది.ఎందుకంటే?అలనాటి సినిమాల్లోని విలువలు.”పేదల జీవిత, సంఘర్షణ లల్లోంచి ఉద్భవించింది ఈ కథ’,.”ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ ఘోష్ సంగీతం, దర్శకత్వం వహించిన సినిమా”.”తెలంగాణ భూపోరాటాన్ని నేపథ్యంగా తీసుకొని “మా భూమి”ని తీశారు’,.’Samresh Basu రాసిన కథ దీనికి మాతృక.”గ్రామాల నుంచి నగరానికి,వలసకు కుటుంబాలు వెళ్ళినప్పుడు వారు అనుభవించే కష్టాలు ప్రస్ఫుటంగా చూయించారు’,.”ఇక కథ లోకి వస్తే,”ఒక కూలి యజమానిని హత్య చేసి భార్యతో నగరానికి పారి పోయి,పారి పోవడం సాధ్యం కాదని గ్రహించి ఇంటికి రావాలని నిర్ణయించుకుంటాడు, డబ్బుల కోసం నదిగుండా పందుల మందను తోలడానికి వారు అంగీకరిస్తారు, గర్భవతి అయిన ఆ ఇల్లాలు పడ్డ మానసిక వేదన ఏంటి అన్నది స్థూలంగా కథ’,.”పందులతో సన్నివేశాలను తీయడం అంటే జుగుస్సతో కూడిన విషయం, కానీ గౌతమ్ పందుల నేపథ్యం ఉన్న కథను ఎంచుకొని,ప్రేక్షకులకు జుగుస్సా అన్న ఫిలింగ్ లేకుండా అందించాడు’,.పాత్రలు, సన్నివేశాలు ఒకదానికొకటి పెనవేసుకొని ప్రేక్షకుడిని మరోలోకంలో విహరింప చేస్తాయి దానికి ప్రధాన కారణం మేలిమైన స్క్రీన్ప్లే.దానికి ప్రధాన కారణం? దర్శకుడు, కథను నడిపిన తీరు.”వేగంగా ప్రవహించే నదినే కాదు,జీవితంలో,కష్టాల, కడలులను దాటడం అంత సులభం కాదు.నౌరంగియాగా, నసీరుద్దీన్,రమ గా శబానా అజ్మీ లు అత్యంత సహజంగా నటించడం వారి నటనకే తార్కాణం. By Prakash Surya
“Paar(1984) By Prakash Surya
37