ఆయన తన నటనా చాతుర్యంతో మన మెదడులోని సహస్ర చక్రానికి చేరి మనని మరో లోకంలోకి విహరింప చేస్తాడు.అలుపెరుగని దీక్ష, వాస్తవిక జీవన విధానం, ఆధ్యాత్మిక జీవనం, సాహసోపేత నిర్ణయాలకు ఆయన నిలువెత్తు సంతకం. సినిమా కలలోని తేజోవంతమైన కళారూపాలను దర్శించిన దార్షనికుడు ఆయన. మానవ జీవితంలో మౌలికమైన అంశం మనిషి వ్యక్తిత్వం అని నమ్మిన ధన్యజీవి.సచేతనంగా, సువ్యక్తంగా, తార్కికంగా, ఆచరణీయంగా, ఆచరించడమే వ్యక్తిత్వం అన్నది ఆయన ఫిలాసఫీ. యంత్రాంగం మనుషుల్ని సమాజాన్ని ఏ విధంగా శాసిస్తుందో, దాన్ని పేద ప్రజలకు ఏ విధంగా అమలుపరచాలో తెలిసిన సామాజిక శాస్త్రవేత్త ఎన్టీఆర్. వాస్తవికత, కార్యాచరణ అనే భావాలు ఆయన ఆలోచన విధానంలో అతి ముఖ్యమైన అంశాలు. కఠోరమైన క్రమశిక్షణకు ఆయన మారుపేరు. మానవ జీవితంలోని సంఘర్షణలోంచి మానవుడు పరిపూర్ణ మానవుడు గా పరిణామం చెందుతాడని ఆ పరిణామ క్రమాన్ని సమూలంగా సంస్కరించిన మహనీయుడు ఎన్టీఆర్. రాజకీయాలంటే కంటే వ్యక్తులు తమ కఠోర పరిశ్రమతో ప్రజల మనోఫలకంపై పరిపూర్ణ స్మారక చిహ్నాల్లా మిగిలిపోగలరని నిరూపించిన రాజకీయ మహర్షి ఆయన. By.Prakash Surya
ఒక రాముడు ఒక కృష్ణుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు By.Prakash Surya
37
previous post