38
రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతున్నాయి:జగపతి బాబు
స్థిరాస్తి రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు సూచించారు నటుడు జగపతి బాబు. ‘రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విషయం చెప్పారు.ఇటీవల నేను స్థిరాస్తి రంగానికి సంబంధించి ఓ యాడ్ లో నటించా. నన్ను మోసం చేశారు. వారెవరు? ఏం జరిగింది? అన్నది త్వరలోనే చెబుతా. ల్యాండ్ కొనేముందు రెరా నిబంధనలు తెలుసుకోండి”అని పేర్కొన్నారు.