45
మెదక్ :
తన కారు నంబర్ (TS10F8999తో HYDలో మరో కారు తిరుగుతోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఈ మేరకు ఈరోజు కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ PSలో ఎమ్మెల్యే సిబ్బంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఓవర్ స్పీడ్ పేరిట తనకు చలాన్
వచ్చిందని, ఆ కారు తనది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన కారు నంబర్ ఎవరు వాడుతున్నారో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.