ప్రఖ్యాత దర్శకుడు ‘David Fincher’ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 93 వ ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచి Best Production Design, Best Cinematography అవార్డ్స్ ని గెలుచుకుంది’,.ఇక కథలోకి వస్తే”మద్యానికి బానిస అయిన, స్క్రీన్ప్లే రచయిత ‘Herman J Mankiwcz’ తను రాసిన “Citizen Kane’ (Greatest Movie Ever Made) సినిమా ద్వారా 1930 దశకంలో హోలీవుడ్ పై ఏవిధంగా తనదైన ముద్ర వేసాడన్నది స్థూలంగా కథ”.”ఒకరకంగా చెప్పాలంటే, ఇది ఓ స్క్రీన్ప్లే రచయిత జీవితంలో జరిగిన అనేక సంఘటనల సమాహారం అనిచెప్పవచ్చూ.”డేవిడ్ ఫించర్ తన తండ్రి చివరి రోజుల్లో రాసిన స్క్రీన్ప్లే ని ఈ సినిమాకి వాడుకోవడం విశేషం.రెడ్ కెమెరా ని ఉపయోగించి బ్లాక్ అండ్ వైట్ లో షాట్స్ ని కూర్చిన సినిమా ఇది.”సత్యాన్ని చెప్పేది బయోగ్రఫీ, కొంతమంది వ్యక్తుల జీవితాలను, కథలో ఇనుమడించాలంటే ఆనాటి సంఘటనలను, దృశ్యాలను కల్లకు కట్టినట్టు తీయాలి అలాంటి ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరిగింది.”ఇలాంటి, కథలను జనరంజకం చేయాలంటే,లక్షశుద్ధి, విస్తృత విషయ పరిజ్ఞానం కలిగిఉండాలి, సత్యనిష్ఠ, సంకల్పం కావాలి, అలాంటి, లక్షణాలను పుణికి పుచుచుకున్న వ్యక్తి డేవిడ్ ఫించర్”. By Prakash Surya.
‘మాంక్’ 2020 (బ్లాక్ అండ్ వైట్ )బై ప్రకాష్ సూర్య
27