నిరంతరంగా ధైర్యంగా ముందుకు పోయే వారికి ఎప్పుడూ అపజయం సిద్దించదు”(Koshish karne walon ki Haar Nahi Hoti) అన్న ప్రముఖ హిందీ కవి Sohanlal Dwivedi కవితను ప్రధాన పాత్ర పలు మార్లు వల్లించడం మనను ఆలోచింప చేస్తుంది..2005 లో విడుదలైన ఈ సినిమాకు Jhon Barua దర్శకత్వం వహించి, అనుపముఖేర్ స్వయానా ప్రధాన పాత్ర పోషించి ,నిర్మించిన సినిమా,బప్పీలహరి సంగీతం అందించడం మరో విశేషం.ఇక కథలోకి వస్తే క్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టే ఓ ఆచార్యుని కథ ఇది.ఆ కుటుంబం ఆయన పరిస్థిని చూసి ఒకొక్కరు విభిన్నంగా స్పందిస్తుండగా,కథ మరో మలుపుకి తిరిగి నేను గాంధీని కావాలని చంపలేదు, నన్ను నమ్మండి అని అందరిని ప్రాధేయ పడుతుంటాడు.అసలు గాంధీకి, ఈయనకు సంబంధం ఏమిటి? ఆ కుటుంబం ఎలా స్పందించింది? ఈ కథ ఎలా ముగిసింది అని మీరు తెలుసుకోవాలంటే సినిమా చూడలిసిందే.ఈ screenply ని ఓ కేస్ స్టడీ గా తీసుకున్నప్పుడు సర్ ఆర్థర్ క్లాసెర్ సృజనాత్మక ప్రక్రియ నాకు గుర్తొచ్చింది, అంటే ద్విసంసర్గ చింతనాన్ని (Bissociative thinking) అనే ఆలోచనకు అక్షర రూపం ఇస్తున్నప్పుడు, అది ఓ abstract ప్రక్రియగా కాకుండా, దానికి లక్ష్యాన్ని కూడా జత చేయొచ్చని.సినిమా చూస్తున్న ప్రేక్షకుడి మెదడులో ఒకే మాటుగా రెండు స్థాయిల్లో, ప్రక్రియలు మొదలవుతాయి,ఒకటి చేతన రెండవది అచేతన.చేతన స్థాయిలో ఒక రూపం మెదలితే అచేతన స్థాయిలో ఇంకో రూపం మెదలుతుంది, అంటే రెండు ఆలోచనల పరస్పర సంఘర్షణ వెండితెర సాక్షిగా జరుగుతుంది, అంటే చేతన, అచేతన స్థాయిల్లో స్తబ్దత ఏర్పడి ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తుంది.ఈ రెండు స్థాయిలు ఏకం కావడమన్నది screenplay లక్ష్యం.కొందరి మానసిక ప్రవర్తన మనకు అర్థరహితంగా తోస్తుంది,మనం దాన్ని లక్ష రహితమని కొట్టిపారేస్తాం,కానీ వారి ప్రవర్తనాలు, చిన్ననాటి అనుభవాలు,సంఘటనలు,భీతులు,వ్యాకులతలు నిజంగానే కొంతకాలం తరువాత మనకు నిజమనిపిస్తాయి.థాట్ ప్రొవొకింగ్ కాన్సెప్ట్ తో అనుపముఖేర్ నటన లోయ నుండి శిఖరాగ్రానికి ఎగిసి,ఊర్మిల హావభావాలతో ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తుంది. By.Prakash Surya
“మైనే గాంధీ కో నహి మారా” (I I Did Not Kill Gandhi) By.Prakash Surya
24