పాతబస్తీ దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలో ప్రారంభం.
మొదట్లో చేప మందు…ప్రస్తుతం చేప ప్రసాదంగా మార్పు.
హైదరాబాద్ :
వుృగశీర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అస్తవూ రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేస్తున్నారు. మగశిర కార్తే ప్రవేశం రోజైన జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిన అనురీత్ గౌడ్, గౌరీ శంకర్ గౌడ్‌లు తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్‌బౌలీలోని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు ఉంటాయంటున్నారు. అనంతరం 8వ తేదీ ఉదయం ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులందరం చేప ప్రసాదాన్ని స్వీకరించిన అనంరతం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలించి చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. శుక్రవారం వారు దూద్ బౌలిలోని తమ నివాసంలో ‘సాక్షి’కి చేప ప్రసాదం తయారీ,పంపిణీ తదితర వివరాలను వెల్లడించారు.
చేప ప్రసాదానికి ఇంట్లోని బావి నీరునే వినియోగిస్తాం..
వుృగశీర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది అస్తవూ రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదానికి దశాబ్దాల చరిత్ర ఉందని వారు తెలిపారు. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్‌బౌలిలోని తవు స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసా దాన్ని తయారు చేస్తాన్నారు. ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పూర్వీకుల నుంచి ఈ బావిలోని నీటినే వాడుతున్నామన్నారు. ఇప్పటికీ ఈ బావిలో నీరు సమృద్దిగా ఉందన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీ సత్యనారా యణ స్వామి వ్రతం నిర్వహించిన అనంతరం తమ కుటుంబ సభ్యులు ముందుగా చేప ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నారు. అనంతరం పంపిణీ కోసం దూద్‌బౌలి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలిస్తామన్నారు.
మూడు రకాల చేప ప్రసాదం…
చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదంలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30,45 రోజలలో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే సత్పలితాలిస్తుందని చెబుతున్నారు.
రెండు గంటలకు ముందుగా…
చేప ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించరాదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేప ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా ఆహారం,నీరు స్వీకరించ రాదు.
నేరుగా రక్త ప్రసరణలో కలవడంతో ఫలితం.
ఔషద గుణాలు కలిగిన ప్రసాదాన్ని చేప నోటిలో పెట్టి మింగడంతో అది కదులుతూ గొంతు ద్వారా జీర్ణాశయంలోకి వెల్లి జీర్ణకోశాన్ని శుభ్రం చేస్తుందంటున్నారు. అంతేకాకుండా నేరుగా జీర్ణాశయంలో జీర్ణం అవుతుండడంతో చేప ప్రసాదం త్వరగా రక్త ప్రసరణలో కలిసి శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుందంటున్నారు.
– సబితా రాజు.డి