Home సినిమా రివ్యూస్ Joseph Campbell ఇలా…రాసే వాడు..By.Prakash Surya

Joseph Campbell ఇలా…రాసే వాడు..By.Prakash Surya

by live
0 comment

ఆయన, స్క్రీన్ప్లే రైటర్ ఏ కాదు ఒక గొప్ప phylosopher కూడా..భారతీయ సనాతన ధర్మ మూలలను, పురాణాలను తెలుసుకోవడానికి భారతదేశానికి అనేక సార్లు వచ్చి భారతీయ ఆత్మను దర్శించుకొన్న గొప్ప స్క్రీన్ప్లే యోగి”.”తులనాత్మక పురాణశాస్త్ర ఆధ్యానం, తులనాత్మక మతాన్ని ఆయన అన్వేషించినట్టు ఇంకొకరు అన్వేషించలేదు’,.
“క్యాంప్‌బెల్” నిర్వచనం ప్రకారం రచనకు అర్థం ఏంటంటే? రూపకాల సమాహారం, ఒక నిర్దిష్ట సమయంలో మానవ అనుభవo, నెరవేర్పు అవకాశం, సంకేత చిత్రాలే కథనాల రూపకం”.”ఇది, అనేక అంశాలను కవర్ చేస్తుంది. “కాంప్‌బెల్” అత్యంత ప్రసిద్ధ రచన “హీరో విత్ ఎ థౌజండ్ ఫేసెస్” (1949), దీనిని అతను,భారతీయ పురాణాల ద్వారా ప్రభావం చెంది రాసాడు.అందులో ప్రధానంగా హీరో సిద్ధాంతాన్ని నిర్వచించాడు., దీనినే ఆయన “మోనోమిత్” అని పిలుస్తారు.                                                                                                                                                          “ది హీరో విత్ ఎ థౌజండ్ ఫేసెస్” ప్రచురణ అయినప్పటి నుండి, క్యాంప్‌బెల్ సిద్ధాంతాలు అనేక రకాల ఆధునిక రచయితలను, కళాకారులను ప్రభావితం చేసింది.ఆయన,తత్వశాస్త్రం “మీ ఆనందాన్ని మీరు అనుసరించండి” ప్రపంచాన్ని ప్రభావితం చేసింది..” జార్జ్ లూకాస్” స్టార్ వార్స్ ద్వారా ఆయన్ని ప్రపంచానికి స్క్రీన్ప్లే రైటర్ గా పరిచయంచేశాడు, తద్వారా ఆయన హాలీవుడ్ లో గుర్తించబడ్డాడు.                                పురాణలు, జనాదరణ పొందిన సంస్కృతి, జానపద కథాంశాలపై ఆయన అభిప్రాయాలను ఒక వర్గం విమర్శించింది,అయినా ఆయన వెనుకడుగు వేయలేదు.”మానవ ఆలోచనల యొక్క పరిధిని, ఉనికిని అధిగమించింది.”ఆయన, అంటాడు:మీకు ఏది మేలు చేస్తుందో,
అది, మీ స్వంత ఉనికి యొక్క రహస్యంతో మిమ్మల్ని సన్నిహితంగా ఉంచుతుంది.కాకపోతే, ఇది అబద్ధం.
ఎందుకంటే?? ప్రపంచంలో సగం మంది ప్రజలు రూపకాలు వాస్తవాలు అని భావించే మతపరమైన వ్యక్తులు వారిని మనం ఆస్తికులు అంటాం. మిగిలిన సగం మంది రూపకాలు వాస్తవాలు కాదని తెలిసిన వారు.
కాబట్టి, అవి అబద్ధాలు.వారే నాస్తికులు.                                                                                                                                                            జీవితం యొక్క సంపూర్ణ రహస్యాన్ని, అయన అతీంద్రియ వాస్తవికత అని పిలిచాడు, అవి, చిత్రాలలో సంగ్రహించబడదు. మరోవైపు, పౌరాణిక రూపకాలు వెలుపల వాస్తవికతను సూచిస్తాయి. వాటిని కాంప్‌బెల్ “బీయింగ్ స్టేట్‌మెంట్స్” అని పిలిచాడు. ఆచారాల ద్వారా వాటి అమలులో పాల్గొనేవారికి ఆ అంతిమ రహస్యాన్ని ఒక అనుభవంగా అందించవచ్చు.పురాణాల యొక్క మొదటి విధి ఏమిటంటే? ఈ విశ్వంలోని.mysterium tremendum et fascinans తో మేల్కొనే స్పృహను పునరుద్దరించడమే.                                                                                                                                                                                                                                                                                                                                                      By.Prakash Surya

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4