మనిషి తను సృష్టించిన భగవంతునికి కూడా అంతుపట్టని జీవి.అలాగే, జోకర్(Joaquin Phoenix) పాత్ర కూడా ప్రపంచ సగటు సినీ ప్రేక్షకుడికి అంతుపట్టని మార్మికమైన నాయకప్రతినాయక పాత్ర.సమాజానికి మనిషికి విడదీయరాని సంబంధం ఉంది.సమాజం మనిషి బయట, మనిషి సమాజం లోపల కాబట్టి మనిషి సమాజానికి అతీతుడు కాదు.తను పెరిగిన వాతావరణం, తన చుట్టూ ఎన్నో రకాల సంఘటనలు, తనను కలవర పరుస్తుంటాయి.ప్రతి చర్యకు తాను ప్రతిచర్య కావాలనుకుంటాడు.ఎందుకంటే? ఎల్లప్పుడు తన అంతరంగంలో ప్రతిచర్యకే ఆకర్షిడవుతాడు కాబట్టి.అలాగే జోకర్ ప్రతిచర్యకే ఆకర్షితుడయ్యాడు.తను నిరంతరం తనకు తెలీకుండా sub-consious మైండ్ లో పెనవేసుకున్న సంఘటనలతో నిరంతరం సతమతమయ్యాడు.అందుకనే తను సమాజాన్ని, మనుషులను ప్రేమిస్తున్నాడో, ద్వేషిస్తున్నాడో లాగా ప్రేక్షకుడి సుప్తచేతనావస్థలో ఓ ప్రశ్న లాగా మిగిలిపోయాడు.జోకర్ పాత్ర డిజైన్ చేయడంలో దర్శకుడు సృజనాత్మక ప్రక్రియకు మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని జోడించి నూతన అర్థాన్ని చెప్పినట్టు మనకు అనిపిస్తుంది.ఈ పాత్ర మార్మికతకు ,అంతర్దృష్టికి, స్వప్నసదృశ్యశీలతకు నూతన అర్థాన్ని విడమరిచి చెప్పింది.జోకర్ పాత్రను ఆకళింపచేసుకున్న తరువాత నాకు ఒక విషయం బోధపడింది, అదేంటంటే? Bi-ssociate thinking అంటే “ద్విసంసర్గ చింతనం” స్థూలంగా చెప్పాలంటే సృజనాత్మక ప్రక్రియలో ఆలోచన ఓకేమాటుగా రెండు స్థాయిల్లో జరుగుతుంటుంది.ఒకటి చేతన రెండవది అచేతన ఆ రెండు స్థాయిలను ఏకం చేయడమే జోకర్ పాత్ర లక్ష్యం. Clinical Delusion లో ఉన్న వారి ప్రవర్తనను అర్థరహితమని, లక్ష్య రహితమని కొట్టిపారేస్తాము, కానీ ఈ అభిప్రాయాన్ని విపర్యం చేసే ఉన్మాదప్రక్రియకు ఓ లక్ష్యం ఉంటుందని ఫ్రాయిడ్ ఎప్పుడో వెల్లడించాడు.అలాగే జోకర్(Joaquin Phoenix) పాత్రకు తనకు తెలీకుండా ఓ లక్ష్యం ఉండడం ఈ Screenplay విశేషం.ఇది ఫ్రాయిడ్ సిద్ధాంతానికి దగ్గరగా ఉండడం మరో విశేషం.జోకర్ ప్రవర్తన,లక్ష్యం మనకు అసంబద్ధంగా అనిపిస్తుంది. తన చిన్ననాటి అనుభవాలు,సంఘటనలు, భీతులు, వ్యాలకులతలను ప్రతిబింబించడం మనకు ఆశ్చర్యమనిపిస్తుంది.ఈ సినిమాలో ఫ్రాయిడ్ మనోవిశ్లేషణా సిద్ధాంత ఓ subtext లా అనిపిస్తుంది.ఫ్రాయిడ్ ప్రభావం సాహిత్యం,నాటకం,చిత్రలేఖనం ,అన్ని రంగాలపై పడింది.ప్రపంచ ప్రసిద్ద చిత్రకారులు పికాసో, సాల్వడార్ లు మనోవిశ్లేషనను అవగాహన చేసుకొని దానిని తమ చిత్రాలలో ప్రతిబింబించారు.అలాగే జోకర్ పాత్రను దర్శకుడు Todd Phillips మలిచిన తీరుతో అది మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మమేకమైందని చెప్పవచ్చుఁ. By.Prakash Surya
“JOKER”పాత్ర ఓ మనోవిశ్లేషణా సిద్ధాంతం” By.Prakash Surya
22