2008 లో విడుదలైన జపనీస్ సినిమా,దర్శకత్వం వహించింది Yojiro Takita.2009 లో Academy Award For Best Foreign Language Film గా ఎంపిక కాబడిన మొట్టమొదటి జపనీస్ సినిమా.27 సంవత్సరాల Motoki అనే యువకుడు ఇండియా సందర్శనలో భాగంగా వారణాసిని సందర్శించినప్పుడు, అక్కడ గంగా నది ఒడ్డున జరిగే శవదహనాలు, చితభస్మాన్ని నదిలో కలపడాన్ని ప్రేరణగా తీసుకొని, జపాన్ కి తిరిగివెళ్లి లైఫ్ అండ్ డెత్ పై tenkue Seiza -Hill Heaven అనే నవల వ్రాసాడు, అది అనతికాలంలో సినిమా గా మలచబడింది.మరణం ఒక ప్రశ్న, మరణం ఒక సమస్య, మరణం ఒక సత్యం,మరణం ఒక నిజం, మరణం ఒక కనువిప్పు..మరణం మార్మికమైనది.కొన్ని మరణాలను చూసిన కొందరు వ్యక్తులు జ్ఞానులవుతారు,వారికి అవి కాగడాలై వారి అందమైన జీవితానికి దారిపోడువున వెలుతురును ప్రసాధిస్తాయి.ఈ భౌతిక జీవితపు తాలూకు,అందమైన ,ఆహ్లాదమైన ఊహాప్రపంచాన్ని నిజంచేసుకొనే అవకాశాన్ని కలిగిస్తాయి.ఇక కథలోకి వస్తే”నిరుద్యోగి అయిన ఓ Musician or Cellist(ఫిడేలు వాధ్యకారుడు) ట్రావెల్లింగ్ ఏజెన్సీ అనుకొని డిపార్చర్ అనే అంత్యక్రియలు జరిపే కంపెనీ లో చేరి స్మశాన వైరాగ్యాన్ని అనుభవించి, జీవితపు అసలు రహస్యం తెలుసుకొని తన జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోవడమే స్థూలంగా కథ.ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే Mood of the auditorium ఎక్కడా డిస్టర్బ్ కాకుండా దర్శకుడు కథను నడిపే విధానం.ఏ scene కా scene ఒకదానికొకటి సవాలన్నట్టు కథనాన్ని డ్రైవ్ చేయడం బహుషా Oscar Commitee ని ఆకర్షించి ఉంటుంది.ప్రపంచంలో అందరూ భయపడే మరణం,జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ప్రేరణ ఇస్తుందా అన్న పాయింట్ నిజంగా ఆలోచింప చేస్తుంది.ఈ తరహా చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను ఒప్పించాలంటే నిజంగా దమ్ముండాలి.మరణం అన్న ఎమోషన్ ని తీసుకొని దానికి ఆనందమనే ఎమోషన్ జతచేసి దాన్ని చక్కగా narrate చేయడం విశేషం.ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ ఆర్గానిక్ కథ ఓ ఆర్గానిక్ స్క్రీన్ప్లే. చివరిగా ప్రఖ్యాత క్రిటిక్స్ ఫ్రెడ్రిక్ అండ్ అన్నా బ్రూత్ మాటల్లో…An exquisite cinematic masterpiece that touches the heart with its treatment of beauty, music, death, and abandonment. By.Prakash Surya
“Departures”స్మశానం నుంచి ఆనందమయ జీవితం వైపు” By.Prakash surya
60