30
ఈరోజు బిజెపి తెలంగాణ యూనిట్ బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు సెల్యూట్ తెలంగాణ ర్యాలీ నిర్వహించనుంది. కేంద్ర మంత్రులుగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణ నేతలైన కిషన్ రెడ్డి బండి సంజయ్ నేడు హైదరాబాదుకు రానున్నారు. 8 లోకసభ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతనకు తెలిపేందుకే సెల్యూట్ తెలంగాణ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు బిజెపి అధికార ప్రతినిధి చెప్పారు.