“జర్నలిజం ఉద్యోగం కాదు, ప్రజా సంక్షేమ జీవన విధానం అన్న సూత్రాన్ని చివరి శ్వాస వరకు ధ్యానించిన అక్షర యోధుడు ఆయన.”సవాలు లేని జీవితం నిస్సారమని తెలియజేసిన ప్రపంచ పదార్థం ఆయన.” సమాజపు అంతరంగాన్ని అంతర్ ముఖాన్ని, కనిపెట్టి పామరులకే కాదు సామాజిక శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన మహామేధావి.”ఆయన నచ్చని మెచ్చని వారికి ఆయన ఇచ్చే సమాధానం..క్రమశిక్షణ, పట్టుదల, సాహసోపేత ధీరత్వం. “నిరంతర క్రమశిక్షణ,కష్టపడటం,కలిసి పనిచేయడం విజయానికి మూల కారణం అని నమ్మిన మహా ఋషి రామోజీరావు. సమాజంలోని విష సర్పాల కోరల్లోని విషాన్ని తీసి, వాటిని మజ్జిగ చేసుకుని అలవాటు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు జర్నలిజానికి ఆయన నిలువెత్తు సంతకం. “జీవితాన్ని కాచి వడపోసి నిరంతరం తన ప్రయోగశాలలో తుది శ్వాస విడిచే వరకు ప్రయోగాలు చేసిన నిత్య నూతన విద్యార్థి రామోజీరావు’. “ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని దాదాపు ప్రతి ఒక్కరు ఆశిస్తారు ఇది తమ అసమర్థతను పరోక్షంగా పరోక్షంగా అంగీకరించడమే అన్న ఆయన ఆలోచన విధానం ప్రతివారిని కార్యోన్ముఖులను చేస్తుంది’. వార్తా విశేషాలు క్రమబద్ధమైన నడకతో ఉండాలని అవి సామాన్యులను ఆలోచింపజేసి విధంగా సాగాలని, తము తీసుకున్న విషయాలను రచయితలు లోతుగా ఆలోచించాలని ఆయన సారధ్యంలో వచ్చిన కథనాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసాయి. “సమాజంలోని సంఘటనను కథనాలుగా మరిచి వాస్తవిక ప్రపంచంలోకి పాఠకులను చేరుకునే దృక్కోణం ప్రతివారిని ఆలోచింపజేస్తుంది. By.Prakash Surya
“అలుపెరుగని అక్షర యోధుడు రామోజీరావు” By.Prakash Surya
53
previous post