ఇది ఓ అమెరికన్ హారర్ సినిమా “Jhon Karinski “దర్శకత్వం వహించి, స్వయాన భార్య అయిన “Emily Blunt” ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది.దృశ్య, శ్రవణ మధ్యమాన్ని ఇముడుచుకొని సర్వకళా సమ్మిళితమైన చిన్న సినిమా.screenplay ని ఛాలెంజ్ చేసి ప్రపంచ సినీ ప్రేక్షకులు ప్రశంశల పొందిన సినిమా.”ఓ కుటుంబం నిర్మానుష్య ప్రాంతంలో , నిశ్శబ్దంలో జీవిస్తూ,సంజ్ఞలు జారిచేసుకుంటూ,శబ్దం వింటే దాడి చేసే భయానక జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడమన్నది సింగల్ లైన్ కథ”.Bryan woods, Scott Beck, Jhon Karanski ల స్క్రీన్ప్లే ప్రపంచ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పొచ్ఛు.ప్రేక్షకుడిని కథనంలో ప్రవేశించేలా చేసి,వాడిని అనుక్షణం భయపెట్టడమన్న రీతిలో డిసైన్ చేసిన స్క్రీన్ప్లే .సర్వసాధారణంగా హారర్ సినిమాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు observer గా మారి ఉద్వేగానికి లోనవుతాడు,కానీ ఇక్కడ ఆ పాత్రలతో ప్రయాణిస్తూ ఉద్వేగానికి లోనుకావడం విశేషం.”Marco Beltrami” సంగీతం ఓ హారర్ మూడ్ ని create చేసి మనను భయపెడుతుంది.ఐడియా లో నవ్యథను అందిపుచ్చుకొని దర్శకుడి దృక్కోణంలోంచి వచ్చిన సినిమా.మనకి సినిమాలంటే అభిమానం, కానీ ప్రేక్షకుడు ఆశించిన రీతిలో మన సినిమాలు రావడం లేదు.ప్రపంచంలోని అన్ని భాషల్లో మంచి సినిమాలు రావాలని ప్రేక్షకులు బలంగా కోరుకుంటున్నారు, దానికి టాలీవుడ్ ప్రేక్షకులు మినహాయింపు కాదు.మన జీవితంలో భాగమైన మన తెలుగు సినిమా ప్రపంచ సినిమాకు ఆదర్శం కావాలని, నవ్య సినిమాకు నాంది పలికే రోజులు వస్థాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. By.Prakash Surya
A Quiet Place” By.Prakash Surya
28
previous post