50
అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, నిర్మాత సురేష్ కొండేటి మరియు సహ నిర్మాతలుగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుండి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ,విడుదలైన మూడు రోజులకే రికార్డు స్థాయిలో 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది.థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరికీ ఒక మంచి అనుభూతిని కలిగిస్తోంది. ఈ సినిమా అమ్మ తాలూకు ప్రేమను, నాన్న తాలూకు బాధ్యతను కలిపిన కథగా మంచి పేరు తెచ్చుకుంది.