Home » “కింగ్డమ్” సినిమాలోని ‘అన్న అంటేనే..’ పాట భావోద్వేగానికి గురిచేసింది – ఆనంద్ దేవరకొండ

“కింగ్డమ్” సినిమాలోని ‘అన్న అంటేనే..’ పాట భావోద్వేగానికి గురిచేసింది – ఆనంద్ దేవరకొండ

By Livewiree24x7

by live
0 comment

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘అన్న అంటేనే..’ అనే పాటను విడుదల చేశారు. అన్నాదమ్ముల అనుబంధం నేపథ్యంగా సాగే ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పాట వినగానే తను ఎమోషనల్ అయ్యానని తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. ‘నేను ఏదైనా సాధించగలను అని నాకన్నా ఎక్కువగా నమ్మి అండగా నిలబడే వ్యక్తి మా బ్రదర్. అన్నాదమ్ముల మధ్య ఉండే అనుబంధాలను గుర్తుచేసేలా ఈ పాట ఉంది..’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు ఆనంద్ దేవరకొండ. ఈ పోస్ట్ లో సోదరుడు విజయ్ తో తీసుకున్న చిన్నప్పటి ఫోటోస్ షేర్ చేశారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4