Home సినిమా రివ్యూస్ “Screenplay ఓ అసాధారణ కళ” By.Prakash Surya

“Screenplay ఓ అసాధారణ కళ” By.Prakash Surya

by live
0 comment

స్క్రీన్ప్లే వంపులు తిరుగుతున్న సెలయేరు లాంటిది, ఆ ఒంపులు దానికి అందం,ఆ ప్రవాహంలోని తీక్షణత,ఘాడత దాని వైవిధ్యం.సినిమా అనేది విసువల్ మీడియం, దానికి మాధుర్యం రావాలంటే చక్కని కథా,కథనాలు అవసరం,ప్రేక్షకుడికి మానసానందాన్ని ఇచ్ఛేవి కథా,కథనంలోని భావాలే తప్ప ఇంకోటి కావు.ఈ రహస్యాన్ని హాలీవుడ్, సినిమా పుట్టినప్పుడే కనిపెట్టి, నిత్య నూతన ప్రయోగాలు చేసి వెండితెరను వర్ధిల్లెట్టు చేస్తే,ఆ రహస్యాన్ని ఆకళింపు చేసుకొని బాలీవుడ్ పయనిస్తుంటే, మనం మాత్రం పంజరంలో బంధించి ప్రేక్షకుడి రెక్కలు కట్టిపారేస్తున్నాము.ఇక్కడ హీరో,హీరోయిన్ ఇమేజి, మార్కెట్ కండిషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్,ట్రీట్మెంట్,కాస్ట్యూమ్స్,సెట్స్,లొకేషన్స్, కారవన్స్ లకు ఇఛ్చిన ప్రాధాన్యతతో పోలిస్తే స్క్రీన్ప్లే కి ఇచ్ఛే ప్రాధాన్యత అతి స్వల్పము.ఇవేవీ లేకున్నా సినిమా తీయోచ్చేమో కానీ మంచి స్క్రీన్ప్లే లేకుండా మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమా మాత్రం ప్రపంచంలో ఎవరూ తీయలేరు.సినిమా కామర్స్, ఆర్ట్ ల మిలితమే కానీ స్క్రీన్ప్లే ని నెగలెక్ట్ చేసే అంత మాత్రం కాదు.సినిమా profit maximisation కోసం ఉంది, కాని కేవలం అది Money Making సాధనం మాత్రం కాదు.స్క్రీన్ప్లే లో ఎప్పుడు scene ,scene కి మధ్య సారూప్యం ఉండాలి, వాటి మధ్య కెమిస్ట్రీ బాగా పండి సినిమాలో ఇంకి పోవాలి, ఇది అంతా స్క్రీన్ప్లే రచయిత ఊహాశక్తి పై ఆధారపడి ఉంటుంది.థియేటర్ లో ప్రవేశించిన ప్రేక్షకుడు సినిమాను చూసి సమ్మోహనుడయ్యేది కథను చెప్పేతీరులోనే తప్ప సినిమా లోని కమర్షియల్ పోకడలో మాత్రం కాదు.తెరపై కథనం పండకపోతే పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకున్ని ఆకట్టుకోకుండా విసుగు పుట్టిస్తాయి.స్క్రీన్ప్లే ప్రధానంగా రెండు రకాలు 1)Organic Screenplay 2)Inorganic Screenplay ఒకటి సేన్ద్రియము మరోటి నిరీన్ద్రియము ప్రస్తుతం వెండితెర నిరీన్ద్రియo తో కొట్టుమిట్టాడుతోంది.ఆర్గానిక్ స్క్రీన్ప్లే లో ఆత్మ ఉంటే నిరీన్ద్రియము లో ఆత్మ లేక బోసిపోతుంది.ప్రేక్షకుడి ఆనందానుభూతికి సినిమా చేరుకోపోవడానికి కొన్ని మనోవైజ్ఞానిక కారణాలు ఉన్నాయి.చివరిగా.. ప్రపంచంలో Bad Stories లేవు కేవలం Bad Narraters మాత్రమే ఉన్నారు.Failed స్క్రీన్ప్లే కి అనేక కారణాలు అందులో ప్రధానమైనవి 1) Personal Story “Bad Script. 2) Guaranteed Commercial Success “Bad Script”.                                                                                                                                                                                                             By.Prakash Surrya

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4