ఓ స్త్రీ వ్యధా పూరిత హృదయాన్ని తవ్వితే,అందులోంచి బయటపడ్డ శిథిలమే “మిర్చ్ మసాలా”.ఎర్రని గాయానికి, ఎర్రని మిర్చి తో స్త్రీలు చేసిన పోరాటమే ఈ సినిమాకి స్ఫూర్తి.1987 లో విడుదలై,స్మితాపాటిల్, నసీరుద్దీన్ షా,ఓంపురి, ప్రధాన పాత్రల్లో నటించి ,Kethan Mehtha దర్శకత్వం వహించిన సినిమా.ఇక కథలోకి వస్తే “ఓ అందమైన, తెలివైన వనిత “సోనా భాయ్” పై గ్రామ సుబేదార్ కన్ను పడుతుంది,ఎలాగైనా సోనాభాయ్ ని పొందాలని , ఊరిని అష్టదిగ్బ్రాంధనం చేస్తాడు.సోనా భాయ్ ఓ మిర్చ్ గోడౌన్ లో ఆశ్రయం పొందుతుంది,ఆమెకు అండగా ఊరిప్రజలు, అబూబాయ్ అనే వ్యక్తి అండగా నిలుస్తారు.ఈ పోరాటంలో అబూబాయ్ మరణిస్తాడు.సోనా భాయ్ ఊరి ప్రజలను కూడగట్టి సుబేదార్ ను తరుముతుంది. ఇది ప్రధానంగా కథ.స్త్రీని లొంగతీసుకోవడానికి పురుషుడు చేసే ప్రయత్నంలో ,వాడి భాధనుంచి విముక్తి కావడానికి స్త్రీ చేసేది తెగింపు.ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి సంపూర్ణ స్వాతంత్రం రావాలని ఆశిద్దాం.పూర్తి ఆనందంతో, సంపూర్న సుఖంతో ,అనిబద్ద స్వేఛ్చా తో ఉంటున్నట్లు నమ్మే స్త్రీలకు కూడా విషాద ఛాయలు అలుముతూనే ఉన్నాయి.”మిర్చ్ మసాలా” అట్టడుగు వర్గానికి చెందిన స్త్రీల దైన్య పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూయిస్తుంది.మృగాళ్ల ఆధిపత్యాన్ని, ఓ స్త్రీ ఎదిరించి విజయసంకేతాన్ని ఎగురవేసింది.స్మితా పాటిల్ ,సోనా భాయ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్త్రీ అబల కాదు సబల అని నిరూపించిన సినిమా.ప్రతి చిన్న ఎదురుగాలికి చలించక, తెగింపుతో ప్రతినాయకుడు ని ఢీకొన్న పాత్రోచిత సంఘటనలు భారతీయ సినిమాకు జేజేలు పలుకుతాయి. ఉద్రిక్తమవుతున్న,మృగాడి నుంచి, అధిపత్యపు గాయాల పై నుంచి పరిపక్వమైన స్త్రీ పోరాటం ఉత్తేజాన్ని నింపుతుంది. By.Prakash Surya
‘Mirch Masala’ By.Praksh Surya
63
previous post