Home వార్తలు తెలుగువారికి తేలికపాటి వానలు

తెలుగువారికి తేలికపాటి వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం

0 comment

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ఐఎండీఏపీలో తేలికపాటి వర్షాలు

 విశాఖపట్నం:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతోంది. ఇది గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. తర్వాత ఉత్తర దిశగా పయనించి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాలకు చేరువై ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారుతుంది. ఆది, సోమవారాల్లో పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరం, త్రిపుర, మణిపుర్‌ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) పేర్కొంది. ఏపీ సహా పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి మినహా భారీ వర్షాలకు అవకాశం లేదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారిణి సునంద తెలిపారు.

మరోవైపు అరేబియా సముద్రంలో కేరళ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం అరేబియా సముద్రం, మాల్దీవులు సహా పరిసర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెలాఖరుకు కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4