అమెరికా,రష్యా ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో రష్యన్ సంస్కృతి, సంప్రదాయాలను,నాగరికతను అర్థం చేసుకోవడానికి ,ఆ దేశంతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న తలంపుతో ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్, రష్యన్ ప్రెసిడెంట్ Mikhail Gorbachew ని కలుసుకోవడానికి ముందు ఈ సినిమాను పెక్కు సార్లు చూసాడంటే ఈ సినిమా గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది.ప్రఖ్యాత దర్శకులు ఫ్రాంకోయిస్ ట్రాఫ్ఫ్ట్,అకిరా కూరసోవా, లు తీసిన “The Last Metro” “Kagmusha” సినిమాలు కాదని Best Foreign Language సినిమాగా 1980 లో Oscar Award దక్కించుకుంది. ఇక కథలోకి వస్తే 1950 ప్రాంతంలో ముగ్గురు యువతులు మాస్కో కి చేరుకుంటారు, అక్కడ వర్కింగ్ విమెన్ హాస్టల్ ల్లో చేరిన వారు మాస్కో మహానగర జీవన చిత్రంలో భవిష్యత్తులో ధనవంతులుగా,సెలబ్రిటీ లు గా కావాలన్న కలలు కంటారు.వారు వారి వారి కలలను సాకారం చేసుకున్నారా లేదా అన్నది స్థూలంగా కథ.ఈ కథను ప్రఖ్యాత screenplay రచయిత Valentine Chornykh రెండు setup లుగా విభజించాడు ఒకటి 1950 ల్లో చెబితే మరోటి 1970 లో చెబుతాడు,screenplay ఈ సినిమాకి ఆయువుపట్టు అని చెప్పవచ్చుఁ.ఆస్కార్ అవార్డ్స్ కమిటీ నియమం ప్రకారం చివరికి నామినేట్ అయిన ఐదు సినిమాలను తిలకించిన మెంబెర్స్ కే వోటింగ్ వేయడానికి అనుమతిస్తారు,అలాగా ఈ సినిమాను ఎక్కువశాతం మెంబెర్స్ చూసి వోట్ వేయడం విశేషం.కమ్యూనిస్ట్ ల కాలంలో అట్టుడికిన రష్యన్ సినిమాను అర్థం చేసుకోవాలంటే అక్కడి నిజజీవిత సంక్షోభాన్ని తెలుసుకోకుండా రష్యన్ సినిమా వికాసాన్ని అర్థం చేసుకోవడం కష్టం.రష్యన్ సినిమా , సమాజం సాధించిన భౌతిక ప్రగతి , ప్రజల దైనందిన జీవితంలో మార్పు ,కళారూపాలు వీటన్నింటిని భేరీజు వేసుకొని మనుగడ సాధించింది.దర్శకుడు Valdimir Menshow కిది రెండవ సినిమా ,తొలిరోజుల్లో నటుడుకావాలని థియేటర్ లో చేరి తరువాత దర్శకుడిగా మారాడు.Katerine, Lyudmila, Natalia Valvita ఎవరికి వారే పోటీపడి నటించిన అద్భుత చిత్రరాజమిది. By.Prakash Surya
Moscow Does Not Believe In Tears By.Prakash Surya
48
previous post