అకాడమిక్ ఇంట్రెస్ట్ తో స్క్రీన్ప్లే ని స్టడీ చేసే వారికి ఈ సినిమా మంచి కేస్ స్టడీ గా ఉపయోగపడుతుంది.ఫిల్మ్ మేకర్స్ ఆలోచనలతోనే జీవిస్తే కేవలం వారిలో సమీక్షణాత్మక విశ్లేషన మాత్రమే పెరుగుతుంది, రసానుభూతి ముమ్మాటికీ పెరగదు, మేకర్స్ లో తెలివితేటలు,వివేకం మేల్కొని ఉన్నా వారిలో ఆనందం అనుభవించే శక్తి నిద్రాన్నమై ఉండడం వల్ల వారు తీసిన సినిమాలు చూసిన ప్రేక్షకులకు రససిద్ది కలగదు.ఆలోచన,అనుభూతి సరిగా ఉన్నప్పుడు సన్నివేశాలు పండుతాయి, అప్పుడు సినిమా సమగ్రంగా జీవిస్తుంది,అనుభూతి రసంగా ఉద్భవిస్తుంది.ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ సినిమాల్లో ఆలోచన, అనుభూతి ఏకమై రసాన్ని సిద్ధిస్తాయి, అలాంటి కోవకు చెంది ముందు వరుసలో ఉండే సినిమా భూమిక.ప్రఖ్యాత నటి హంసా వాడెకర్ ఆత్మ కథ ఈ సినిమా.ఇక కథలోకి వస్తే ” దేవదాసి అయిన ఉష తల్లి ఓ బ్రహ్మణుణ్ణి పెళ్లి చేసుకుంటుంది,అతడు మద్యానికి బానిసై మరణిస్తాడు.కుటుంబ భారం ఉష పై పడుతుంది, దూరం బంధువైన కేశవ్ ,ఉషలో ఉన్న సంగీత ప్రావీణ్యాని గమనించి సినిమా రంగంలో నటిగా రాణించడానికి సహాయం అందిస్తాడు. రాజన్ అనే నటుడు తనను ఇష్టపడినా, అందరూ వారించి నా పెద్దవాడైన కేశవ్ ను పెళ్లాడుతుంది.పెళ్ళైన తరువాత పని ఒత్తిడి లేకుండా వైవాహిక జీవితాన్ని గడుపుదామనుకున్న తనను, ఆదాయం కోసం కేశవ్ నటిగా కొనసాగమని హింసిస్తుంటాడు.చివరికి ఆత్మహత్యే శరణ్య మనుకొని ఫైల్ అయి, ఓ వ్యాపారికి రెండో భార్యగా వెళుతుంది అక్కడ కష్టాలు రెట్టింపవుతాయి.కుటుంబ నియమం ప్రకారం ఆడవాళ్లు ఇంటి గడప దాట రాదన్న కఠిన నియమం అమలుపరుస్తాడు ఆ వ్యాపారి.చివరికి ఉష ఆ పంజరం నుంచి తప్పించుకొని, గూటికి చేరిందా లేదా అన్నది కథ.స్త్రీ కేవలం ఓ ఆటవస్తువేనా,వారు సమాజపు బూటకపు కట్టుబాట్లకు లొంగిపోవాలిసిందేనా,అన్న చర్చను ఈ సినిమా లేవదీస్తుంది.నటీమనుల బ్రతుకు పోరాటాన్ని, వారి ఇష్టాలను,కోరికలను,కన్నీళ్లను,భాదామయ జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది ఈ సినిమా.సక్సెస్ఫుల్ biopics కి ఓ chronological ఆర్డర్ ఉండాలన్న విషయాన్ని బోధిస్తుంది ఈ స్క్రీన్ప్లే.కథ అంతా flasbacks తో కొనసాగుతూ కథనాన్ని gripping గా తీర్చిదిద్ది, మేకింగ్ లో signature ని ప్రేక్షకుడి sub-conscious మైండ్ లో వేయడం శ్యామ్ బెనెగల్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.స్మితాపాటిల్ అపురూపమైన నటన,ఆమోల్ పాలేకర్, అమ్రిష్ పూరి ఎవరికి వారు పరకాయ ప్రవేశం చేసిన అద్భుత చిత్రరాజ మిది.By.Prakash surya
54
previous post