Home అంతర్జాతీయం రాజీవ్ గాంధీ కార్యచరణే సాంకేతిక విప్లవానికి మూలం

రాజీవ్ గాంధీ కార్యచరణే సాంకేతిక విప్లవానికి మూలం

పల్లెలు బాగుండాలని ఆశించిన వ్యక్తి రాజీవ్ : మంత్రి పొన్నం

0 comment

ఘనంగా భారతరత్న ,భారత దేశ మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి

న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళ్లు అర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్

న్యూయార్క్ :

రాజీవ్ గాంధీ భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి ఆనాడు చేపట్టిన కార్యాచరణలో భాగంగానే ఈరోజు భారతదేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించడానికి కారణమైందని మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు.  రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన  మాట్లాడుతూ..అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం తేవడానికి కూడా నేరుగా ఢిల్లీ నుండి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి , పల్లెలు బాగుండాలని ఆశించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అటువంటి వ్యక్తికి కొనియాడితూ.. ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం మన బాధ్యత అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని మంత్రి పొన్నం  పిలుపునిచ్చారు .

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4