ఇరాన్ అధ్యక్షుడి ప్రమాద కోణంలో ఎన్నెన్నో అనుమానాలు…
అందరి కన్నూ మోస్సాద్ పైనే…..
హైదరాబాద్ :
ప్రపంచంలో ఏ మూల నక్కి ఉన్నా సరే …తన దేశానికి , పౌరులకు శత్రువుగా భావించిన వారిని ఎవరినీ వదలదనే పేరు తెచ్చుకుంది ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్…నాజీల కాలంలో యూదులు అనుభవించిన ఘోర కష్టాలు…అవమానాలను మళ్ళీ చూడొద్దనే ఒకే ఒక లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాని ఏజెంట్లు సైలెంట్ గా పని చేస్తూ ఉంటారు… ఒకప్పుడు అత్యంత గొప్ప జాతిగా పేరుగాంచిన యూదులు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వివిధ దేశాలకు చెల్లాచెదురుగా తరలిపోయారు… అయితే క్రమక్రమంగా ఇజ్రాయిల్ ఏర్పాటుతో తిరిగి తమ సొంత దేశం గా భావించే ప్రాంతానికి తరలి రావడం మొదలు పెట్టారు… అయితే అప్పటికే వివిధ దేశాల్లో సెటిల్ అయిన చాలా మంది యూదులు అక్కడే తమ పిల్లలను ఆ దేశ పౌరులుగా మార్చుకున్నారు. ఇదంతా గత చరిత్ర.. కానీ తమ జాతి కోసం తమ కోసం ఏర్పడిన ఇజ్రాయిల్ కోసం ఇప్పటికీ బలమైన మద్దతు దారులుగా కొనసాగుతున్నారు. ఆయా దేశాల్లో ఆర్థిక సామాజిక రంగాల్లో తిరుగులేని పట్టు సాధించి తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నారు.
బలమైన రక్షణ రంగం.. కఠినమైన విదేశాంగ విధానం..
ఒకసారి దారుణంగా దెబ్బతిన్న జాతి తిరిగి పునాదులతో సహా దేశాన్ని నిర్మించుకుంటే తమ దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో… అలాంటి అన్ని చర్యలను తీసుకుంది ఇజ్రాయిల్… ఒకవైపు రక్షణారంగ బడ్జెట్ ని దేశాల స్థాయిలో పెంచుతూనే ఎక్కడెక్కడో సెటిల్ అయినా తమ జాతికి చెందిన అత్యున్నత సైంటిస్టులను తిరిగి స్వదేశం కోసం పని చేయాల్సిందిగా ఆహ్వానించింది.. ఈ క్రమంలో తిరిగి వచ్చిన అనేకమంది సైంటిస్టులు ఆ దేశ రక్షణ రంగ పరిశోధనల్లో గొప్ప విజయాలు సాధించారు… ఇక చాణక్యుడు చెప్పినట్లుగా ఒక దేశం బలంగా ఉండాలంటే గూడచార వ్యవస్థ దుర్భైద్యంగా ఉండాలని సూత్రాన్ని ఇజ్రాయిల్ పూర్తిగా వంట పట్టించుకుంది.. తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను సంస్థలను గుర్తించడం.. వారిని తొలి దశలోనే అంతం చేయడం అలవాటుగా మార్చుకుంది… అయితే అలాంటి దేశానికి సైతం కొన్ని సంఘటనలు సవాల్ విసిరాయి.. ముఖ్యంగా జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో 1972లో జరిగిన ఒలంపిక్స్ సమయంలో హమాస్ మద్దతు గల బ్లాక్ సెప్టెంబర్ ఉగ్రవాదుల దాడి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.. అందులో తమ దేశ పౌరులైన 11 మంది అథ్లెట్లు ఉగ్రవాద దాడిలో మరణించడంతో ఇజ్రాయిల్ గూడచారి సంస్థ తన వ్యూహాలకు పదును పెట్టింది… ఆ దాడికి కారణమైన ముఖ్య ఉగ్రవాద నేతలతో పాటు అందులో పాల్గొన్నట్టు… పాల్గొన్న వారికి వేర్వేరు దేశాల్లో మద్దతుగా నిలిచిన అనేకమంది హమాస్ మద్దతుదారులను వివిధ ఆపరేషన్లలో మట్టుబె ట్టింది… దీంతో మొస్సాద్ పేరు గూడచార వర్గాల్లో మార్మోగింది… అంతేకాదు ప్రపంచ దేశాల్లో తన శత్రువు ఎక్కడ దాగి ఉన్నా అంతం చేసి తీరుతుందనే పేరు సంపాదించుకుంది.
ఆనాటి నుండి ఈనాటి ఆపరేషన్ల వరకు…
క్రమక్రమంగా ఉగ్రవాద ఆపరేషన్లలో తన పట్టు పెంచుకుంటూ పోయిన ఇజ్రాయిల్… Mossad ఏజెంట్లకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చింది.. దీంతో వారు తమ విశ్వరూపం చూపించారు… ప్రపంచవ్యాప్తంగా ఓ సంఘటన అనేక దేశాలను ఆశ్చర్యపోయేలా చేసింది.. 2010 సంవత్సరంలో దుబాయిలోని ఓ హోటల్లో మారువేషంలో ఉన్న హమాస్ మిలిటరీ వింగ్ “ఖాసీం బ్రిగేడ్” కి చెందిన టాప్ లీడర్ అల్ మబుహా ను దాదాపు 33 మంది వివిధ దేశాల నుండి వచ్చిన mossad ఏజెంట్లు ఫాలో అయ్యారు… చివరికి అతని హోటల్ రూమ్ లోనే ఇలాంటి ఆయుధాలు వాడకుండా విష ప్రయోగం చేసి దిండుతో ప్రాణాలు తీశారు.. పూర్తి ఆపరేషన్ అక్కడి హోటళ్లతోపాటు చుట్టుపక్కల ఉన్న భవనాలను ఉన్న సీసీటీవీలో నిక్షిప్తం కావడంతో ఆ దేశం ఇలాంటి సంఘటనపై విచారణ కోసం కమిటీని నియమించింది.. అయితే చంపిన క్షణాల్లోనే ఏజెంట్లు అంతా మళ్లీ వేషాలు మార్చుకొని తమ స్వస్థలాలకు విమానాలను మార్చుతూ వెళ్ళిపోయారు.. దీంతో మరోసారి ఇజ్రాయిల్ పని చేసే విధానంపై ప్రపంచవ్యాప్తంగా గూడచారి వర్గాల్లో చర్చ జరిగింది… ఇలాంటి దేశంలోనైనా తమ ఏజెంట్లు పని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలరని ఇజ్రాయిల్ ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ పంపింది..
బెడిసి కొట్టింది ఇక్కడే…
అప్పటివరకు తిరుగులేని పట్టున్న ఇజ్రాయిల్ వివిధ దేశాల్లో అణ్వస్త్ర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న అనేకమంది ఇరాన్.. ఈజిప్ట్ ఇతర ముస్లిం దేశాల సైంటిస్టులను సైలెంట్ గా హతమార్చింది.. అయితే అక్టోబర్ 8 , 2023 లో హమాస్ నుండి ఊహించని ఉగ్రవాద దాడి ఇజ్రాయిల్ ఎదుర్కొంది .పారా గ్లైడర్లను వినియోగించి భారీ ఎత్తున ఆయుధాలతో వచ్చిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి ఎంటర్ అయిన వెంటనే కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి చంపారు. ఇందులో మొత్తం 1139 మంది చనిపోగా కేవలం “సూపర్ నోవా” మ్యూజిక్ ఫెస్టివల్ పై జరిగిన దాడిలో మరణించిన వారి సంఖ్య 260. అంతేకాకుండా వేలాదిమంది ఇజ్రాయిల్ పౌరులు బందీలుగా హమాస్ చేతికి చిక్కారు. దీంతో తన సొంత దేశంలోనే దాడికి గురై ఇజ్రాయిల్ మానసికంగా దెబ్బతింది… ఎదురు దాడులకు దిగి గాజాతోబాటు అనేక ప్రాంతాల్లో వైమానిక దాడులను చేసి అనేకమందిని మట్టుబెట్టినా… గతంలో ఉన్న శత్రుదుర్భేద్యమనే పేరును కోల్పోయింది…
ఇక కొడితే మైండ్ బ్లాక్ కావాలనే బిగ్ రిస్క్ కి సిద్ధమైన మొస్సాద్!!!
అప్పటివరకు తనపై ఉన్న భయం పోవడంతో ఇలాంటి దాడులు పునరావృతం అవుతాయని ఇజ్రాయిల్ అగ్ర నేతలు భావించారా???… తన పౌరుల్లో ఏర్పడిన అభద్రతా భావాన్ని సైతం పోగొట్టాలంటే తన శత్రువుల్లో ఒక టాప్ వ్యక్తిని టార్గెట్ చేసిందా అంటే ఎక్కువగా అవుననే సమాధానమే వస్తుంది… డ్రోన్ టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉన్న ఇరాన్.. వాటిని వినియోగించి పాలస్తీనియకు మద్దతుగా ఇజ్రాయిల్ పై దాడులకు దిగింది.
అయితే శత్రుదుర్భేద్యమైన ఐరన్ డోమ్ సహకారంతో దాదాపుగా వాటిని కూల్చి వేయగలిగింది ఇజ్రాయిల్… ఇక శత్రువు ఎవరు డిసైడ్ అయిపోయింది… తనతో సమానంగా… బలమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉన్న ఇరాన్ అధ్యక్షుడు తమ దేశంపై వరుస దాడులకు ఆదేశాలు ఇవ్వడం… ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్ వ్యతిరేక దేశాలను కూటమిగా జతకట్టడంతోపాటు.. రానున్న రోజుల్లో ప్రమాదకరమైన నేతగా మారుతున్నాడని భావించి ఉండవచ్చు… కొద్దిరోజుల క్రితం ఇజ్రాయిల్ గూడచారి సంస్థ చీఫ్ కూడా తమ దేశంపై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో తెరవెనుక ఏదో జరుగుతుందని సందేహాలు అంతటా వెలువడ్డాయి…
ఇంతలో ఇలా….
ఇక రెండు రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం ఒక్కసారిగా ప్రపంచ దేశాలను షాక్ కి గురిచేసింది… కరుడుగట్టిన ఇజ్రాయిల్ వ్యతిరేకుడిగా పేరు ఉండడంతోపాటు ఆ దేశంపై యుద్ధం విషయంలో దూకుడుగా వెళుతుండడంతో ప్రమాదం జరిగిన విధానంపై పలు సందేహాలు వెల్లువెత్తాయి… ఇక ఇరాన్ మద్దతు దేశాలు దీనిపై కాస్త బహిరంగంగానే మొస్సాద్ పాత్ర పై అనుమానాలు వ్యక్తం చేశాయి.. ప్రమాదం జరిగిన సమయంలో ఒక లేజర్ బీమ్ ఆ ప్రాంతంలో కనిపించిందంటూ పుకార్లు షికార్లు చేయడంతో మళ్లీ సీక్రెట్ ఆపరేషన్లకు ఇజ్రాయిల్ సిద్ధమైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
ఏది ఏమైనా శత్రువులను అంతం చేయడంలో తెగింపు… టెక్నాలజీని వాడడంలో అందరికన్నా ముందుండే స్వభావం ఆ ఏజెన్సీని అగ్రగామిగా నిలుపుతున్నాయి.. అయితే ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదంటూ ఒక టాప్ మోస్సాద్ అధికారి ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం కొసమెరుపు…
Raj
Sr. journalist