Home జిల్లాలు చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ

చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ

సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

0 comment

నైరుతి రుతుపవనాలపై చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ.. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

హైదరాబాద్ :

భారత దేశ రైతులతో పాటు, ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. వేసవి అనంతరం నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకనున్నట్లు ఐపీండీ అంచనా వేసింది. అయితే ఈ రుతుపవనాలు సాధరణంగా భారత్ లోకి జూన్ 1 లేదా మొదటి వారంలో వస్తుంటాయని.. ఐఎమ్‌డీ జనరల్ మృత్యుంజయ్ తెలిపారు. అయితే ఒక్క రోజు ముందుగా రావడం ముందస్తేం కాదని.. సాధారణ తేదీనే అని ఆయన స్పష్టం చేశారు. దీంతో రైతుల్లో ఆనందం మొదలైంది. రుతుపవనాల తిరోగమనం సమయంలో ఆశించి స్థాయి వర్షాలు కురవకపోవడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే చెరువులు, నదులు పూర్తి స్థాయిలో ఎండిపోయి ఉన్నాయి. తమిళనాడు, బెంగళూరు ప్రాంతాల్లో నీటి కరువు కూడా ఏర్పడింది. ఈ క్రమంలో రుతుపవనాలు సరైన సమయంలో వస్తున్నాయని ఐఎండీ తెలపడం ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే భారత దేశ వ్యవసాయ రంగానికి జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలలో కురిసే వర్సాలపైనే రైతులు, వ్యవసాయం అధికంగా ఆధారపడి ఉంటుంది. కాగా వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4