గోల్డ్ మోడల్ విజేతలను అభినందించిన నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప
హైదరాబాద్ :
రుమటాలజీ, క్లినికల్ ఇమ్యునాలజీ విభాగంలో డాక్టర్ ఎన్‌బి(డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్) పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన నిమ్స్ ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమృత గోపాలన్ కు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ వరించింది. అదే విధంగా మెడికల్ సైన్సెస్‌లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేసన్స్(ఎన్‌బిఈఎంఎస్) నిర్వహించిన ఈ పరీక్షల్లో డాక్టర్ అమృత గోపాలన్‌తో పాటు నిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం వైద్యులు డాక్టర్ శరత్ చంద్ర కూడా రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. వీరితో పాటు నిమ్స్ ఇమ్యునో హీమటాలజీ, బ్లడ్ ట్రాన్స్‌ప్యూజన్ విభాగం వైద్యులు సీహెచ్. వినయ్ కుమార్ కూడా డిఎన్‌బీ పరీక్ష ఈ ఏడాది ఏప్రిల్ సెషన్‌లో అత్యధిక మార్కులు సాధించి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. వీరికి న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎన్‌బిఈఎంఎస్ 22వ కాన్వకేషన్ లో ఎన్‌బిఈఎంఎస్ నుంచి నిమ్స్ వైద్య నిపుణులు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్‌ను అందుకున్నారు. శుక్రవారం బంగారు పతక విజేతలను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతో పాటు నిమ్స్ డీన్ ప్రొఫెసర్ లీజా రాజశేఖర్, మెడికల్ సూపరిండెంటెండ్ ప్రొఫెసర్ నిమ్మ. సత్యనారాయణ, పలువురు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు కూడా గోల్డ్ మెడల్ సాధించిన వైద్యులను అభినందించారు.