ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి అధ్వానం..
సంక్షోభానికి తెర పడేది ఎప్పుడు..
సగటు సినీ ప్రేక్షకుడు ఆనందించేది ఎప్పుడు
హైదరాబాద్ :
తెలుగు సినిమా పరిశ్రమ ఎల్లలు దాటి ఎనలేని పేరును ఆర్జించిదన్నది అక్షర సత్యం.వాస్తవంలోకి తొంగి చూస్తే సినిమా పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీని కారణం?? మంచి సినిమాలు థియేటర్స్ రాకపోవడమే!!! ఇందుకు నాసిరకం సినిమాల అందించిన దర్శక నిర్మాతలు కూడాను…ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.చేవ చచ్చిన సినిమాలు చూడలేక ప్రేక్షకులు సినిమా థియేటర్స్ రావడం పూర్తిగా మానేశారు. సింగిల్ థియేటర్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సినిమా వేసిన నష్టం వేయక పోయినా నష్టం. దానికి తోడు ఐపీఎల్ సీజన్, ఎండలు, నిన్నటివరకు ఎలక్షన్స్ అగ్నికి అర్జం పోసిన రీతిగా తయారయ్యాయి. కొన్ని రోజులపాటు థియేటర్స్ మూసి వేస్తున్నట్టు ప్రకటనలు వెలువబడుతున్నాయి. ఈ సంక్షోభానికి తెర పడేది ఎప్పుడు??? సగటు సినీ ప్రేక్షకుడు ఆనందించేది ఎప్పుడు???