Home గెస్ట్‌కాల‌మ్స్‌ హైదరాబాద్ జూబ్లీ క్లబ్‌లో ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి 

హైదరాబాద్ జూబ్లీ క్లబ్‌లో ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి 

0 comment

ఎవరి వల్ల రాష్టం, దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే వారిని ఎన్నుకోండి.

హైదరాబాద్ :

‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరి వల్ల రాష్టం, దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే వారిని ఎన్నుకోండి. ఓటు మీ భాధ్యత, మీ హక్కు’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్ జూబ్లీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం   మాట్లాడుతూ… ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోదరుడు పవన్ కల్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా జూబ్లీ క్లబ్‌కు వచ్చి ఓటేశారు. చిరంజీవి భార్య సురేఖ, కూతురు సుస్మితలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ క్యూలో నిలబడి ఓటు వేశారు. తాజాగా ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకుని హైదరాబాద్ తిరిగివచ్చిన మెగాస్టార్  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

 

 

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4