Home హైదరాబాద్ నిర్మానుష్యంగా మారిన భాగ్యనగరం

నిర్మానుష్యంగా మారిన భాగ్యనగరం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో..ఖాళీగా రహదారులు

0 comment

ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు

హైదరాబాద్‌:

ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కోఠి, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తగ్గాయి. రాత్రి పగలూ తేడా లేకుండా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే నగర రహదారులు ప్రస్తుతం.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో లోకస్‌సభ, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4