బెంగాల్ గవర్నర్‌పై సీఎం మమత కీలక ఆరోపణలు.. ఒరిజినల్ వీడియో ఉందంటూ..
బెంగాల్ గవర్నర్ ఆనందబోస్‌కు షాకిచ్చారు సీఎం మమత. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఫుల్ వీడియోల పెన్‌డ్రైవ్ తన దగ్గర ఉందన్నారు దీదీ.. గవర్నర్ విడుదల చేసిన వీడియో ఎడిటెడ్ అని ఆరోపించారు. బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాజ్‌భవన్ ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో గవర్నర్ చూపించిన వీడియో ఎడిటెడ్ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన దగ్గర ఫుల్ వీడియోల పెన్‌డ్రైవ్ ఉందన్నారు. గవర్నర్ సి.వి.ఆనంద బోస్ పై ఓ మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన గవర్నర్.. ఘటన జరిగినట్లుగా చెబుతున్న మే 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని 100 మంది పౌరులకు చూపించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ వీడియోలు ఎడిటెడ్ అని ఆరోపించారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రవర్తన చాలా దారుణంగా ఉందన్నారు. దీదీగిరిని సహించబోనని గవర్నర్ అంటున్నారని , కానీ ఆయన దాదాగిరీ ఇక పని చేయదన్నారు.
మహిళలపై వేధింపులకు పాల్పడిన గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలన్నారు. ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు చెప్పాలి. ఆయన గవర్నర్‌గా ఉన్నంతకాలం నేను రాజ్‌భవన్‌కు వెళ్లను’’ అని మమత అన్నారు. గత నెల 24న, ఈనెల 2న గవర్నర్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయమై తనను గవర్నర్ రెండుసార్లు పిలిపించారని, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించారు. అయితే వీటిని ఆనందబోస్ కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే నాటి సీసీటీవీ దృశ్యాలను గవర్నర్ సాధారణ పౌరులకు చూపించారు. అయితే, దీనిపై బాధితురాలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన ముఖాన్ని బ్లర్ చేయకుండా వాటిని బయటపెట్టారని ఆరోపించారు. దీనిపై రాష్ట్రపతికి లేఖ రాస్తానని తెలిపారు