కకడపజిల్లా జరిగిన బహిరంగ సభ రాహుల్ గాంధీ మాట్లాడుతూ..షర్మిల నా చెల్లి అంటూ వైఎస్సార్ జోహార్ అని నినాదాలు చేశారు. రాజకీయాల్లో కుటుంబ సంబందాలు ఉంటాయి. వై ఎస్ రాజశేఖర రెడ్డి నా తండ్రికి సోదరుడు. రాజీవ్ , ఆయన ఇద్దరు ఆన్న తమ్ముళ్లు. ఈ బంధం చాలా ఏళ్ళ క్రితం నుంచే ఉంది. వైఎస్సార్
దేశానికి మార్గదర్శకుడు..ఆయన పాదయాత్ర నాకు ఆదర్శం. జోడో యాత్ర అందుకు స్ఫూర్తి. ఆయన నాకు దేశం మొత్తం పాదయాత్ర చేయాలని చెప్పారు. నాకు అన్ని విషయాల్లో మార్గదర్శకుడు ఉన్నారు.
పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి వెళ్తాం అని వైఎస్సార్ నాకు చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుస్తాయి. భారత్ జోడో ద్వారా ఈ దేశపు వీదులు తిరిగాను. ఆయన సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశాడు. ఇప్పుడు ఏపిలో అది లేదు. ఇప్పుడు మార్పు రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్సార్ డిల్లీలో ఏపి హక్కులపై పోరాటం చేసే వాళ్ళు. ఇవ్వాళ ఏపీని బీజేపీ బీ టీమ్ నడిపిస్తుంది.
బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ వీళ్ళ రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ చేతిలో ఉంది. మోడీ చేతిలో CBI ఉంది..ED ఉంది. అందుకే వీళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారు. YSR సిద్ధాంతం… కాంగ్రెస్ సిద్ధాంతం బీజేపీ కి వ్యతిరేకం. జగన్ మాత్రం బీజేపీ కి మద్దతుగా ఉన్నారు.
బీజేపీని జగన్ ఒక్క మాట అనరు. అవినీతి బయట పడుతుంది అని భయం. ఇదే భయం చంద్రబాబుకి ఉంది. ఏపీ హక్కులు డిల్లీలో వినపడాలి అంటే..కాంగ్రెస్ రావాలి. ఏపీ విభజన అయ్యాక బీజేపీ ఎన్నో హామీలు చేసింది. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి అమలు చేయలేదు.
ప్రత్యేక హోదా వచ్చిందా ?.. పోలవరం కట్టారా ?.. కడప స్టీల్ కట్టారా ?
బీజేపీ ముందు ఏపి ఆత్మ గౌరవం తల దించుకొని ఉంది.
ఏపిలో అవినీతి సర్కార్ నడుస్తుంది. 2014 లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే అన్ని హామీలు నెరవేరేవి. 2024 లో కాంగ్రెస్ అధికారంలో వచ్చాకా ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తాం. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం. పోలవరం ప్రాజెక్టు కడతాం. కడప స్టీల్ ప్లాంట్ కడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో మేము కొన్ని వాగ్ధానాలు ఇచ్చాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తాం. నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం. 2.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. చరిత్రలో ఎవరు చేయని ఆలోచనలు చేస్తున్నాం. ప్రతి కుటుంభం నుంచి ఒక బీద మహిళను ఎంపిక చేస్తాం. ఆ మహిళకు బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు ఏడాదికి ఇస్తాం. ప్రతి నెల 8500 రూపాయలు ఇస్తాం. కోట్లాది మంది జీవిత శైలి మారుతుంది
– మేము కోట్లాది మంది నీ లక్షాది కారులం చేస్తాం
– ఈ దేశ ప్రజలను మోడీ సోమరి పోతులను చేస్తున్నారు
– రైతులకు కనీస మద్దతు ధర ఇస్తాం
– ప్రతి ఏడాది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం
– ఉపాధి హామీ పథకాన్ని 400 కి పెంచుతాం
– రాజ్యాంగాన్ని రక్షించే పనిలో ఉన్నాం
– ఈ రాజ్యాంగం పరిరక్షిస్తే మనకు హోదా వస్తుంది
– ఈ రాజ్యాంగం ద్వారానే పోలవరం ప్రాజెక్టు వస్తుంది
– మోడీ ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు
– మోడీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు
– భారతీయుల భవిష్యత్ మన రాజ్యాంగం మీద ఆధారపడి ఉంది
– అన్ని వర్గాల ప్రజలకు లభించిన హక్కులు ఈ దేశ రాజ్యాంగం తోనే..
– కాంగ్రెస్ , YSR ఒక్కటే
– YSR కాంగ్రెస్ లోనే ఉన్నారు
– కాంగ్రెస్ పార్టీ YSR ఆలోచనలకి వ్యతిరేకంగా ఉండదు
– CBI ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ YSR పేరును చేర్చలేదు
– ఇది స్వార్థం కోసం చేసిన పని
– YSR మా వాడు
– YSR బిడ్డ నా చెల్లెలు ఇవ్వాళ మీ ముందు నిలబడింది
– నా చెల్లి పార్లమెంట్ లో ఉండాలి
– YSR సైద్ధాంతిక విలువలు షర్మిల లో ఉన్నాయి
– నా చెల్లెలి తరుపున ఏపి ప్రజల వాగ్ధానం అడుగుతున్న
– వైఎస్ షర్మిలను పార్లమెంట్ లో పంపాలి
– ఏపి ప్రజల ఆలోచనలు డిల్లీలో వినపడాలి
– షర్మిల ముందు ఏ CBI, ఏ ED నడవదు
– నాకు వాగ్ధానం చేయండి
షర్మిల లో వైఎస్సార్ సైద్ధాంతిక విలువలు..
కాంగ్రెస్ పార్టీ ఆయన ఆలోచనలకి వ్యతిరేకంగా ఉండదు: రాహుల్
25
previous post