Home ఆంధ్ర ప్రదేశ్ ఇక ప్రచారం స్టాప్ – మైకులు బంద్

ఇక ప్రచారం స్టాప్ – మైకులు బంద్

ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్

0 comment

రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు

శనివారం సాయంత్రం 6 గంటలకు బంద్ కానున్న ప్రచార మైక్ లు

12 వ తేదీ రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని అనుమతిచ్చిన ఈసి

13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్

పోలింగ్ శాతం పెంచేందుకు 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్  : పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్.. పోలింగ్ సమయానికి 48 గంటల ముందే మైకులు బంద్ అవుతాయని తెలిపిన ఈసీ…. డోర్ టు డోర్ ప్రచారానికి మరో 24 గంటల సమయం ఇచ్చింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ఈసీ అటు పోలీస్ సైడ్ సర్వం సిద్ధం అంటున్నారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల పోలింగ్ కేంద్రాలు ఉండగా దాదాపు 33,000 వరకు వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల అధికారులు. ఇక కేవలం ఎన్నికల అధికారులు మూడు లక్షల మంది పనిచేయగా 160 కేంద్రాల బలగాలకు సంబంధించిన పోలీసులు రాష్ట్ర పోలీసులు మరొక లక్ష వరకు పనిచేస్తున్నారు అన్నది అధికారులు చెప్తా ఉన్నారు..రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాయంత్రం ఐదు గంటల వరకు ముగియాల్సిన సమయాన్ని మరో గంట పెంచుతూ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇక 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ నిర్వహణ జరగగా…. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 5 పార్లమెంట్ స్థానాల్లోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో

ఇక్కడ పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి 4 గంటల వరకే జరగనుంది. అదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు,వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి,మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో..ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుందనీ ఈసి పేర్కొంది..

ఒక పోలింగ్ కు 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుంది. అయితే 12వ తేదీ రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు మరో అవకాశాన్ని కల్పించింది. ప్రచారంతోపాటు 11వ తేది సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాపులు కూడా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ సెక్టర్లలో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటల్స్ రెస్టారెంట్స్ సైతం మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతోపాటు లేబర్ కు సంబంధించినటువంటి హాలిడే కూడా ప్రకటించడంతో ఆరోజు వ్యాపారపరమైనటువంటి ఏ కార్యక్రమాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉండవు..మొత్తానికి రెండు నెలల పాటు సాగినటువంటి ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని వివరిస్తున్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అధికారులు…

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4