Home హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి

సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి

ఎన్నికల అధికారికి విశ్వ పరిషత్ ఫిర్యాదు

0 comment

సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి..

ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసిన విశ్వహిందూ పరిషత్

హైదరాబాద్ :

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వంపై.. హిందూ విశ్వాసాలపై.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, సీతామాతలపై విమర్శలు గుప్పించడాన్ని విశ్వహిందూ పరిషత్ తప్పుపడుతోంది. ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలను అవమానపరిచారని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. “విశ్వహిందూ పరిషత్ వాళ్లు పంచిన అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి కంట్రోల్ బియ్యంతో తయారుచేసి పెంచారు”అని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ.. ముస్లిం, క్రైస్తవుల మెప్పు కోసం ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గురువారం సాయంత్రం బి ఆర్ కే భవన్ లో తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజు ని కలిసి VHP నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ .. జై శ్రీరామ్ అంటే ఉద్యోగం వస్తుందా..? పొలాలకు నీరు వస్తాయా..? అంటూ వ్యంగంగా ఎగతాళి చేశారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా విచక్షణ కోల్పోయి హిందుత్వంపై దూషణలు చేస్తున్నారని వివరించారు. హిందూ దేవి దేవతలను దూషించే నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకొని, రాజ్యాంగ విలువలను కాపాడాలని విశ్వహిందూ పరిషత్ నేతలు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో, పవిత్రతతో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతలు పంపిణీ చేశామని.. హిందువులందరూ ఇష్టంగా వాటిని పూజించారని గుర్తు చేశారు. అయితే హిందుత్వం బలపడడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు పోటీపడి అయోధ్య రామ జన్మభూమి ప్రాణప్రతిష్ట కార్యక్రమం, శ్రీరామనవమి వేడుకలు, హనుమాన్ జయంతి శోభాయాత్రలపై విమర్శలు చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా ఏమైనా ఆరోపణ చేయాల్సి ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ, పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు ఆరాధించే దైవాన్ని దూషిస్తే చూస్తూ ఊరుకోమని వికాస్ రాజ్ దృష్టికి తీసుకువచ్చారు. విషయాలను సావధానంగా విన్న ఎన్నికల అధికారి సానుకూలంగా స్పందించారు. అన్ని విషయాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విశ్వహిందూ పరిషత్ నేతలకు హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4