Home ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం

వంగవీటి మోహన రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ 

0 comment

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం

వంగవీటి మోహన రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ

విజయవాడ  :

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీపేపీ ప్రజా కూటమి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించిందని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఈరోజు గురువారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తో కలిసి జగ్గయ్యపేట మండలంలో గండ్రాయి, మల్కాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంలో అధికార వైఎస్ఆర్ పార్టీని వీడి చావా కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తాతయ్య గారు, వంగవీటి రాధా పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు._ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని జగన్ మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు మీ పేరు మీద ఉన్న స్థలాలు పొలాలను మీరు కష్టపడి సంపాదించుకున్న మీ హక్కును కాగితాలను జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అటువంటి వాడిని నమ్మి ఓటు వేస్తే మన ఆస్తులు మనకు కాకుండా పోతాయన్నారు. సంక్షేమం పేరు చెప్పి మొత్తం అందరి దగ్గర దోచేసి ఎలక్షన్స్లో ఓట్లు కొనడానికి డబ్బు వాడుతున్నారు అన్నారు.

వైసిపి వారు ఇచ్చే డబ్బులు తీసుకుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని, ఎంపీగా కేశినేని శివనాద్ (చిన్ని)ని, జగ్గయ్యపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే తాతయ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తాతయ్య  మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున అందిస్తామన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేస్తామని తెలిపారు. ప్రతి యువకునికి ఉద్యో గం కల్పించే విధంగా బాధ్యత తీసుకుంటామన్నారు. మెగా డీఎస్పీపై తొలిసంతకం చేస్తామని అదే విధంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పంచడమే కూటమి లక్ష్యమన్నారు. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3వేల భృతి ఇస్తామన్నారు. తొలుత పేద వృద్ధుల కోసం ఎన్టీఆర్‌ పెన్షన్‌ అమలు చేస్తే చంద్రబాబు రూ.2వేలకు పెంచారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.4వేల పింఛన్‌ అందిస్తామన్నారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షల బీమా, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 50శాతం సబ్సిడీపై రుణాలు టీడీపీ ఘనత అన్నారు. వేలాది మందికి విదేశీ విద్య అవకాశం కల్పించినది చంద్రబాబు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న టిడిపి బిజెపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4