నాడు ఉద్యమాల తెలంగాణ…
నేడు ఉత్సవాల తెలంగాణ…
నల్లబంగారపు సిరులు
తెల్లబంగారపు విరులు
విరివిగా విరిసిన హరితవనాలు
నా తెలంగాణ తల్లికి శిరసున
పొదిగిన ఆభరణాలు…
యాదాద్రి నరసింహ
భద్రాద్రి రామయ్య ల
సాక్షిగా…
ఈ దశాబ్ది వేడుకలే సాక్ష్యాలు…
నలుదిశలా భాగ్యనగరపు జిలుగులు వెలుగులు…
మిషన్ భగీరథలై పారుతున్న
యేరుల సవ్వళ్లు…
రైతుబంధులు… దళితబంధులు
నిరుపేదల పాలిటి ఆపద్భాందవులు…
కళ్యాణ లక్ష్మి... షాదీముబారక్ లు
తెలంగాణ ఆడపడుచులకు ఇస్తున్న వాయినాలు…
మన ఊరు…మన బడి…
ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట ఉత్సవాలు…
నా తెలంగాణ మట్టి లోని మాణిక్యాలను యేరుతున్న
మేటి కార్యక్రమాలు…
స్వతంత్రం వచ్చి దశాబ్దాలు దాటినా
శతాబ్దాల చరిత్ర గల
దశాబ్దం క్రితం యేర్పడిన
నా తెలంగాణ…
మట్టిలోన సేద్యం…
బడిలోన అక్షర సేద్యం చేస్తూ…
నిజంగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని…
దేశం నలుమూలల చాటుతూ…
ప్రపంచం నలుమూలలా
నా తెలంగాణ కీర్తి పతాకాలను
ఎగరేసే రోజు రాబోతోంది…
వివిధ భాషా కోవిదులు… విద్యావేత్తలు..
తెలంగాణ నెత్తురు పంచుకు పుట్టిన
ఉద్యమకారులదీ నేల…
నా తెలంగాణ నేల…