– ఉపాధి హామీ తీసుఖచ్చి పేదలకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది
– ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మనఇంటి ఆడ బిడ్డ ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీ తో గెలిపించాలి
– ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో ముచ్చటించిన మంత్రి సీతక్క
– ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణను ఆశీర్వదించాలని కోరిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిర్మల్ జిల్లాలోని నిర్మల్, లోకేశ్వరం మండలాల పరిధిలోని రత్నాపూర్ కాలనీ, అబ్బాపూర్, రచ్చపూర్, వడ్యాలతో పాటు పలు గ్రామాల్లో రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం రచ్చాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో ముచ్చటించారు. కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బలహీనవర్గాల గుండె చప్పుడు విన్న నేత రాహుల్ గాంధీ తొలిసారిగా ఆదివాసి అడబిడ్డ అయిన ఆత్రం సుగుణకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ గౌరవించిందన్నారు. భారత దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రూపుమాపి, కుల వ్యవస్థను, మనుధర్మ శాస్త్రాన్ని, వర్ణ వ్యవస్థను తీసుకువచ్చి మధ్యయుగం నాటి అణిచివేత, అంటరానితనం తిరిగి తీసుకురాబోతున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాహుల్‌గాంధీ ప్రధాన కావాలని కోరారు. నరేంద్ర మోదీ కార్పొరేట్ కంపెనీల నాయకుడని మంత్రి సీతక్క విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అభివృద్ధి గురించి అడిగితే, అయోధ్యను చూపిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్తి స్తాయి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాకోవాలని కోరారు. ఇచ్చిన హమీలు సకాలంలో అమలు చేస్తుందని తెలిపారు.
గత పదేళ్లలో కేసీఆర్, పెద్ద పెద్ద బంగ్లాలు, ఫాహౌజ్ లు కట్టుకున్నారే తప్ప.. రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టివ్వలేదని, నరేంద్ర మోదీ కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేశారు, రైతులకు రుణా మాఫీ చేయడాని మన్సు రాలేదని విమర్శించారు విమర్శించారు.
ఆదివాసి, మన ఇంటి ఆడ బిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజార్టీ తో గెలిపించాలి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు.
వివిధ పార్టీల నుంచి బారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం లోకేశ్వరపురంలో ముఖ్యనేతల సమావేశంలో రాష్ట్ర ఇన్చర్జ్ దీపదాస్ మున్సి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో మంత్రి సీతక్క హాజరు అయ్యారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు