హైదరాబాద్ : మహిళల టి20 వరల్డ్ కప్- 2024 షెడ్యూల్‌ను విడు దల చేసింది ఐసిసి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది.మొత్తం 10 జట్లు పోటీపడ నుండగా వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, న్యూజిలాండ్, క్వా లిఫయిర్-1 జట్లు ఉన్నాయి.
గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడతాయి.
గ్రూప్ ద శలో టాప్‌లో తొలి రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సిల్హె ట్ వేదికగా అక్టోబర్ 17న తొలి సెమీఫైనల్ జరుగనుండగా ఢాకా వే దికగా అక్టోబర్ 18న రెండో సెమీస్ జరగనుంది.
ఇక ఢాకా వేదికగా అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ నిర్వ హించనున్నారు. ప్రారంభ మ్యాచ్ లో ఇంగ్లండ్ -సౌతా ఫ్రికా జట్లు తలపడతాయి. ఇక భారత్ అన్ని గ్రూప్ మ్యాచ్‌లు సిల్హెట్‌లోనే ఆడనుంది.
అక్టోబర్ 4న న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో, 9న క్వాలిఫయిర్-1 టీమ్‌తో, 13వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ తలపనుంది…