Home జాతీయం రెండు సమూహాల మధ్య ఎన్నికలు..

రెండు సమూహాల మధ్య ఎన్నికలు..

పేదల హక్కులను హరించ డమే కమలం పార్టీ లక్ష్యమని మండిపడ్డ రాహుల్‌

0 comment

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలను ఇచ్చామని, వాటిని పూర్తిగా అమలు చేస్తున్నామని కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపించారు. దాంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు. పేదల హక్కులను హరించి, పెద్దలకు ప్రయోజనం చేకూర్చడమే కమలం పార్టీ లక్ష్యమని మండిపడ్డారు.

ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని నిర్మల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన జనజాతర సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు.

ప్రస్తుత ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయని రాహుల్‌ గాంధీ అన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్‌ ఉంటే, మరోవైపు భారత రాజ్యాంగాన్ని మార్చే సమూహం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారానే దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని, హక్కులు సంక్రమించాయని చెప్పారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు.

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే దేశవ్యాప్తంగా మహిళలకు ఆర్థికసాయం చేస్తాం. భారతదేశంలో పేదల జాబితాను తయారు చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబం నుంచి మహిళ పేరును ఎంపిక చేసి వారి ఖాతాలో రూ.లక్ష వేస్తాం. ఆదివాసీలు అంటే భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నవారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది ప్రజల పక్షాన ఆలోచిస్తుంది.  ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఉద్యోగం ఇస్తాం. నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నైపుణ్య శిక్షణ ఇస్తాం. ఆదివాసీల భూసమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అనిరాహుల్‌ గాంధీ ప్రకటించారు.

రైతులకు రుణమాఫీ చేస్తామంటే తమని ప్రశ్నిస్తున్నారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. పెద్దలకు బీజేపీ రుణమాఫీ చేస్తే ఎవరూ అడగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రూ.2500 బ్యాంక్‌ ఖాతాలో వేస్తామని, ఆరోగ్య భద్రత రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. పేదలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4